Chandra Babu : పొత్తుల కోసం… అయ్యో పాపం చంద్రబాబు ఏం దుస్థితి వచ్చేను
Chandra Babu : రాజకీయంగా తనంత అనుభవస్తుడు ఈ దేశంలో ఎవరు లేరని చెప్పుకుంటూ తన యొక్క గొప్పతనంను తానే చెప్పుకుంటూ ఉండే తెలుగు దేశం పార్టీ అధినేత స్థితికి ఆయన సొంత పార్టీ నాయకులు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ దారుణమైన పరాజయం పాలయ్యిన నేపథ్యంలో చంద్రబాబుకు ఏం చేయాలో పాలుపోక పదే పదే వైకాపా ప్రభుత్వంను విమర్శించడమే పనిగా పెట్టుకున్నాడు.
ఈమద్య కాలంలో వైకాపా ను ఎలాగైనా గద్దె దించాలనే పట్టుదలతో తన స్థాయిని కూడా చిన్నా చితకా విమర్శలు చేస్తూ ఉన్నాడు. ఒక పార్టీ అధినేత.. చాలా కాలం పాటు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు ఇలాంటి వ్యాఖ్యలను చేయడం చూసి అంతా కూడా అవాక్కవుతున్నారు. అధికారం కోసం మరీ ఇంతగా చంద్రబాబు నాయుడు దిగజారడం ఏంటో అంటూ చాలా మంది ముక్కున వేలేసుకుంటున్నారు.
జనాల దృష్టిని ఆకర్షించడం కోసం చంద్రబాబు చేస్తున్న కుప్పిగంతులు విమర్శల పాలు అవుతున్నాయి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు చిన్న పార్టీ అయిన జనసేన పార్టీని కలుద్దాం అంటూ పొత్తులకు ఆహ్వానిస్తుంది. మరో వైపు బీజేపీ అస్సలు నీతో మాకు వద్దంటూ దూరం జరిగినా కూడా బాబు మాత్రం వెళ్లి హగ్ చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. పొత్తుల కోసం దిగజారి మరీ చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నాడు అంటూ ఆ పార్టీ నాయకులు స్వయంగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.