TDP leaders : తెలుగు ప్రజలకు ఎక్కువ కాలం సీఎంగా వ్యవహరించింది ఎవరు అంటే మరో ఆలోచన లేకుండా చంద్రబాబు నాయుడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంతో పాటు ప్రత్యేక ఏపీకి కూడా ముఖ్యమంత్రిగా వ్యవహరించాడు. ఆయన ఎన్నో ఎత్తు పల్లాలను చూశాడు. అలాంటి చంద్రబాబు నాయుడు రాజకీయ ఉద్దండుడిగా ఉండాల్సింది పోయి అనుభవం అనుభవం అంటూ చాదస్తంగా వ్యవహరిస్తున్నాడు అంటూ ఆయన పార్టీ నాయకులు స్వయంగా పెదవి విరుస్తున్నారు. ఇప్పటికే చాలా సార్లు చంద్రబాబు నాయుడు తీసుకున్న తప్పుడు నిర్ణయాల కారణంగా ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. మళ్లీ చంద్రబాబు నాయుడు చాదస్తంతో నిర్ణయాలు తీసుకుంటే మరింతగా లోతున పడిపోవాల్సి వస్తుందని తెలుగు తమ్ముళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తిరుపతి పార్లమెంట్ స్థానంకు ఉప ఎన్నిక జరుగబోతుంది. అందుకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలుగు దేశం పార్టీ తరపున రెండు మూడు నెలల క్రితమే ఉప ఎన్నిక అభ్యర్థి ఎవరు అనే విషయాన్ని చెప్పేశారు. అలా ముందే అభ్యర్థిని ప్రకటించడం వల్ల వారికి వ్యతిరేకంగా ఉన్న వారు ఇప్పటి నుండే వేరే పార్టీకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేయడంతో పాటు టీడీపీ అభ్యర్థిని వీక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. అంత ముందుగా అభ్యర్థిని ప్రకటించడం అనేది ఖచ్చితంగా తప్పుడు నిర్ణయం అని బాబు చాదస్తంకు ఇదే నిదర్శణం అన్నట్లుగా చంద్రబాబు నాయుడుపై నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
చంద్రబాబు నాయుడు రాజకీయ వ్యూహ కర్త అంటూ ఒకప్పుడు మంచి పేరు ఉంది. ఎన్టీఆర్ నుండి అధికారం బదిలీ అయినప్పటి నుండి చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా మరీ ఇంతగా ఇబ్బందులు పడ్డ సందర్బాలు లేవు. తన రాజకీయ అనుభవం అంత వయసు కూడా లేని వైఎస్ జగన్ వద్ద చంద్రబాబు నాయుడు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు అంటూ ఆయన పార్టీ నాయకులు చెబుతున్నారు. ఎక్కడ నుండి ఏం దూసుకు వస్తుందో అంటూ చంద్రబాబు నాయుడు పదే పదే ఆందోళన పడుతున్నాడట. దానికి తోడు చంద్రబాబు నాయుడు రాజకీయ వ్యూహాలు అన్ని కూడా వైఎస్ జగన్ ముందు తలకిందులు అవుతున్నాయని అంటున్నారు. మొత్తానికి చంద్రబాబు నాయుడు రాజకీయంగా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఏమైనా ప్రభావం చూపించకుంటే ఇక ఆయన రాజకీయ భవిష్యత్తు అంతం అయినట్లే అంటున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.