TDP leaders : చంద్రబాబు అనుభవం కాస్త చాదస్తంగా మారుతోంది అంటున్న తమ్ముళ్లు, అసలేం జరిగిందటే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

TDP leaders : చంద్రబాబు అనుభవం కాస్త చాదస్తంగా మారుతోంది అంటున్న తమ్ముళ్లు, అసలేం జరిగిందటే..!

TDP leaders : తెలుగు ప్రజలకు ఎక్కువ కాలం సీఎంగా వ్యవహరించింది ఎవరు అంటే మరో ఆలోచన లేకుండా చంద్రబాబు నాయుడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంతో పాటు ప్రత్యేక ఏపీకి కూడా ముఖ్యమంత్రిగా వ్యవహరించాడు. ఆయన ఎన్నో ఎత్తు పల్లాలను చూశాడు. అలాంటి చంద్రబాబు నాయుడు రాజకీయ ఉద్దండుడిగా ఉండాల్సింది పోయి అనుభవం అనుభవం అంటూ చాదస్తంగా వ్యవహరిస్తున్నాడు అంటూ ఆయన పార్టీ […]

 Authored By himanshi | The Telugu News | Updated on :10 February 2021,10:30 am

TDP leaders : తెలుగు ప్రజలకు ఎక్కువ కాలం సీఎంగా వ్యవహరించింది ఎవరు అంటే మరో ఆలోచన లేకుండా చంద్రబాబు నాయుడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంతో పాటు ప్రత్యేక ఏపీకి కూడా ముఖ్యమంత్రిగా వ్యవహరించాడు. ఆయన ఎన్నో ఎత్తు పల్లాలను చూశాడు. అలాంటి చంద్రబాబు నాయుడు రాజకీయ ఉద్దండుడిగా ఉండాల్సింది పోయి అనుభవం అనుభవం అంటూ చాదస్తంగా వ్యవహరిస్తున్నాడు అంటూ ఆయన పార్టీ నాయకులు స్వయంగా పెదవి విరుస్తున్నారు. ఇప్పటికే చాలా సార్లు చంద్రబాబు నాయుడు తీసుకున్న తప్పుడు నిర్ణయాల కారణంగా ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. మళ్లీ చంద్రబాబు నాయుడు చాదస్తంతో నిర్ణయాలు తీసుకుంటే మరింతగా లోతున పడిపోవాల్సి వస్తుందని తెలుగు తమ్ముళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

TDP leaders not happy with chandra babu naidu decisions

TDP leaders not happy with chandra babu naidu decisions

తిరుపతి ఉప ఎన్నిక విషయంలో బొక్క బోర్ల పడ్డ బాబు..

తిరుపతి పార్లమెంట్‌ స్థానంకు ఉప ఎన్నిక జరుగబోతుంది. అందుకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలుగు దేశం పార్టీ తరపున రెండు మూడు నెలల క్రితమే ఉప ఎన్నిక అభ్యర్థి ఎవరు అనే విషయాన్ని చెప్పేశారు. అలా ముందే అభ్యర్థిని ప్రకటించడం వల్ల వారికి వ్యతిరేకంగా ఉన్న వారు ఇప్పటి నుండే వేరే పార్టీకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేయడంతో పాటు టీడీపీ అభ్యర్థిని వీక్‌ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది ఎంత మాత్రం కరెక్ట్‌ కాదని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. అంత ముందుగా అభ్యర్థిని ప్రకటించడం అనేది ఖచ్చితంగా తప్పుడు నిర్ణయం అని బాబు చాదస్తంకు ఇదే నిదర్శణం అన్నట్లుగా చంద్రబాబు నాయుడుపై నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

TDP leaders : బాబు వ్యూహాలు తలకిందులు..

చంద్రబాబు నాయుడు రాజకీయ వ్యూహ కర్త అంటూ ఒకప్పుడు మంచి పేరు ఉంది. ఎన్టీఆర్ నుండి అధికారం బదిలీ అయినప్పటి నుండి చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా మరీ ఇంతగా ఇబ్బందులు పడ్డ సందర్బాలు లేవు. తన రాజకీయ అనుభవం అంత వయసు కూడా లేని వైఎస్‌ జగన్‌ వద్ద చంద్రబాబు నాయుడు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు అంటూ ఆయన పార్టీ నాయకులు చెబుతున్నారు. ఎక్కడ నుండి ఏం దూసుకు వస్తుందో అంటూ చంద్రబాబు నాయుడు పదే పదే ఆందోళన పడుతున్నాడట. దానికి తోడు చంద్రబాబు నాయుడు రాజకీయ వ్యూహాలు అన్ని కూడా వైఎస్ జగన్ ముందు తలకిందులు అవుతున్నాయని అంటున్నారు. మొత్తానికి చంద్రబాబు నాయుడు రాజకీయంగా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఏమైనా ప్రభావం చూపించకుంటే ఇక ఆయన రాజకీయ భవిష్యత్తు అంతం అయినట్లే అంటున్నారు.

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది