TDP : టీడీపీ సభ్యుల తీరుపై విమర్శలు.. సస్పెండ్ చేయడం సబబే
TDP : అసెంబ్లీలో ప్రజల సమస్యలను తీర్చేందుకు ప్రజా ప్రతినిధులు సమస్య లపై చర్చించాలి. అధికార పక్షం లో ఉన్న వారిని ప్రతి పక్షంలో ఉన్న వారు ప్రశ్నించాలి. ప్రజల పక్షాన నిలబడి ప్రతి పక్షం వారు అధికార పక్షాన్ని నిలదీయాలి. అప్పుడే అది ఒక మంచి రాజకీయ వ్యవస్థ అవుతుంది, ఆ సమయంలోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తోంది. అసెంబ్లీలో కూడా రాజకీయం చేస్తాం.. రాజకీయ లబ్ధికి అసెంబ్లీ సమావేశాలను ఉపయోగించుకుంటాం అని చూస్తే అది ఖచ్చితంగా క్షమించరాని నేరం అవుతుంది అంటూ రాజ్యాంగంలోనే పేర్కొనడం జరిగింది.రాజ్యాంగం కల్పించిన హక్కు ఉంది అంటూ కొందరు అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేయడం,
ఇష్టానుసారంగా వ్యవహరించడం వంటివి చేయడం ద్వారా అది ప్రజలకు అన్యాయం చేయడం అవుతుంది అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో తెలుగు దేశం పార్టీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం సమంజసంగా లేదని కొందరు సీనియర్ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికి చంద్రబాబు నాయుడు శపథం చేసి తాను అసెంబ్లీలో అడుగు పెట్టను అంటూ సమావేశాలకు దూరంగా ఉన్నాడు.ఇప్పుడు ఆయన పార్టీ సభ్యులు కూడా అసెంబ్లీ సమావేశాలు జరగకుండా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమైన బిల్లులు చాలా పెండ్డింగ్ లో ఉన్నాయి. ప్రజలకు అవసరమైన బిల్ లు పాస్ చేయాల్సి ఉన్నవి.
కానీ తెలుగు దేశం పార్టీ నాయకుల వ్యవహారం వల్ల ప్రజలకు దక్కాల్సిన అభివృద్ధి ఫలాలు సంక్షేమ ఫలాలు అందడం లేదు అంటూ వైకాపా విమర్శిస్తోంది. సభా కార్యక్రమాలకు అడ్డు రావడంతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయంపై తెలుగు దేశం పార్టీ నాయకులు గగ్గోలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ నాయకుల సస్పెండ్ పై ప్రజలు మరియు రాజకీయ విశ్లేషకులు స్పందిస్తూ సభా కార్యక్రమాలను దురుద్దేశంతో అడ్డుకునే వారిని సస్పెండ్ చేయడంలో తప్పులేదు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.