YCP – TDP : వైసీపీ – టీడీపీ ఎంపీల ప్రసంసల వర్షం.. వెనక జరుగుతోంది ఇదేనా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

YCP – TDP : వైసీపీ – టీడీపీ ఎంపీల ప్రసంసల వర్షం.. వెనక జరుగుతోంది ఇదేనా?

YCP – TDP : అధికార వైసీపీ, టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అనే విషయం అందరికీ తెలుసు కదా. టీడీపీ నేతలను వైసీపీ నేతలు, వైసీపీ నేతలను టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శిస్తూ ఉంటారు. ఒకరిని మరొకరు దూషించుకుంటూ ఉంటారు. అంతేకానీ.. ఒకరిని మరొకరు మెచ్చుకోరు. కానీ.. తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టీడీపీలోచర్చనీయాంశమవుతున్నాయి. నిజానికి.. కేశినేని నాని చాలా రోజుల నుంచి టీడీపీ అధిష్ఠానం మీద గుర్రుగా […]

 Authored By kranthi | The Telugu News | Updated on :23 May 2023,2:00 pm

YCP – TDP : అధికార వైసీపీ, టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అనే విషయం అందరికీ తెలుసు కదా. టీడీపీ నేతలను వైసీపీ నేతలు, వైసీపీ నేతలను టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శిస్తూ ఉంటారు. ఒకరిని మరొకరు దూషించుకుంటూ ఉంటారు. అంతేకానీ.. ఒకరిని మరొకరు మెచ్చుకోరు. కానీ.. తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టీడీపీలోచర్చనీయాంశమవుతున్నాయి.

నిజానికి.. కేశినేని నాని చాలా రోజుల నుంచి టీడీపీ అధిష్ఠానం మీద గుర్రుగా ఉంటున్నారు. పార్టీ కార్యకలాపాల్లోనూ పాల్గొనడం లేదు. ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న ఆయన ఏకంగా వైసీపీ ప్రభుత్వాన్ని పొగిడారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. అభివృద్ధి కోసం వైసీపీతో కలిసి పనిచేస్తా అని ఆయన అనడం టీడీపీ నేతలను విస్మయానికి గురి చేసింది.

tdp mp kesineni nani and ysrcp mla jagan mohan rao praises each other

tdp mp kesineni nani and ysrcp mla jagan mohan rao praises each other

YCP – TDP : స్థానిక ఎమ్మెల్యే జగన్మోహన్ బాగా పనిచేస్తున్నారంటూ ప్రశంస

స్థానిక ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ బాగా పనిచేస్తున్నారంటూ కేశినేని నాని ప్రశంసల వర్షం కురిపించారు. టీడీపీ, వైసీపీ పార్టీలు వేరు.. వాటి సిద్ధాంతాలు వేరు. కానీ.. అభివృద్ధి కోసం కలిసి పనిచచేస్తామని కేశినేని నాని స్పష్టం చేశారు. నందిగామ నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈసందర్భంగా రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం అవుతాయని అన్నారు. పార్టీలన్నీ కలిసి అభివృద్ధి కోసం పనిచేయాలని తెలిపారు. రాజకీయాలను పక్కన పెట్టి అధికార, ప్రతిపక్ష పార్టీలు అభివృద్ధి కోసం పనిచేయాలని ఆయన సూచించారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది