tdp mp kesineni nani and ysrcp mla jagan mohan rao praises each other
YCP – TDP : అధికార వైసీపీ, టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అనే విషయం అందరికీ తెలుసు కదా. టీడీపీ నేతలను వైసీపీ నేతలు, వైసీపీ నేతలను టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శిస్తూ ఉంటారు. ఒకరిని మరొకరు దూషించుకుంటూ ఉంటారు. అంతేకానీ.. ఒకరిని మరొకరు మెచ్చుకోరు. కానీ.. తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టీడీపీలోచర్చనీయాంశమవుతున్నాయి.
నిజానికి.. కేశినేని నాని చాలా రోజుల నుంచి టీడీపీ అధిష్ఠానం మీద గుర్రుగా ఉంటున్నారు. పార్టీ కార్యకలాపాల్లోనూ పాల్గొనడం లేదు. ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న ఆయన ఏకంగా వైసీపీ ప్రభుత్వాన్ని పొగిడారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. అభివృద్ధి కోసం వైసీపీతో కలిసి పనిచేస్తా అని ఆయన అనడం టీడీపీ నేతలను విస్మయానికి గురి చేసింది.
tdp mp kesineni nani and ysrcp mla jagan mohan rao praises each other
స్థానిక ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ బాగా పనిచేస్తున్నారంటూ కేశినేని నాని ప్రశంసల వర్షం కురిపించారు. టీడీపీ, వైసీపీ పార్టీలు వేరు.. వాటి సిద్ధాంతాలు వేరు. కానీ.. అభివృద్ధి కోసం కలిసి పనిచచేస్తామని కేశినేని నాని స్పష్టం చేశారు. నందిగామ నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈసందర్భంగా రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం అవుతాయని అన్నారు. పార్టీలన్నీ కలిసి అభివృద్ధి కోసం పనిచేయాలని తెలిపారు. రాజకీయాలను పక్కన పెట్టి అధికార, ప్రతిపక్ష పార్టీలు అభివృద్ధి కోసం పనిచేయాలని ఆయన సూచించారు.
Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…
Nithin : టాలీవుడ్లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…
Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
This website uses cookies.