TDP Politics : ఏపీలో పొత్తులు ఖాయమేనా..? టీడీపీ వర్గాల్లో చర్చ..
TDP Politics : ఏపీలో ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ అధికార, ప్రతిపక్షాలు ఇప్పటినుంచే కసరత్తు మొదలు పెట్టారు. అయితే ఈసారి ఏపీలో పొత్తులు పొడిచే అవకాశాలు ఎక్కువగానే కనబడుతున్నాయి. ఎలాగైనా సరే వైసీపీ అధికారంలోకి రాకుండా టీడీపీ పొత్తులకు స్వాగతస్తున్నట్లు తెలుస్తోంది. అయితే జగన్ సర్కారుకు వ్యతిరేకంగా ఇప్పటికే జనసేన అధినేత పోరాడలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకునే ఆలోచనలో ఉన్నట్లు, చంద్రబాబు ఇప్పటికే పార్టీ సీనియర్ నేతలో చర్చించినట్లు తెలుస్తోంది.
2014 ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. కాగా గత ఎన్నికల్లో జససేన అధినేతతో దూరం పెరగడంతో ఒంటరిగానే పోటీ చేసి దారుణంగా విఫలం అయింది. అయితే ఈసారి వైసీపీని అధికారంలోకి రానియ్యకుండా రెండు పార్టీలు బలంగా కోరుకుంటున్నాయి. వీరి అభిప్రాయాలు వేరైనా లక్ష్యం ఒక్కటే కాబట్టి ఈ రెండు పార్టీలు కలిసి నడవబోతున్నట్లు వినిపిస్తోంది. అంతేకాకుండా బీజేపీ, లెఫ్ట్ పార్టీలను కూడా కలుపుకొని పోనున్నట్లు సమాచారం. ఇటీవల సమావేశంలో టీడీపీ అధినేత ఈ విషయం ప్రస్తావించినట్లు తెలుస్తోంది. తెలుగు తమ్ముళ్లు కూడా పొత్తులపై ఆసక్తితో ఉన్నట్లు చెబుతున్నారు.అయితే టీడీపీ వచ్చే ఎన్నికల్లో సీట్ల విషయంలో త్యాగాలకైనా వెనుకాబోమని చంద్రబాబు చెబుతున్నట్లు వినిపిస్తోంది.
ఏదేమైనా వైసీపీ అధికారంలోకి రాకుండా అందరూ కలిసి పోరాడాలని అందుకు టీడీపీ నాయకత్వం వహిస్తుందని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ప్రత్యేక్షంగా ఇతర పార్టీలతో పొత్తులపై చర్చలు జరపకపోయినప్పటికీ పరోక్షంగానే ఆహానిస్తున్నారు. అయితే అన్ని పార్టీల కామన్ ఎజెండా వైసీపీకి అధికారం దక్కకుండా చేయడమే. అయితే అధికార పక్షం కూడా ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా నెగ్గాలని గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసినట్లు తెలస్తోంది. ఎమ్మెల్యేలు ప్రజల్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. వైసీపీ అధినేత కూడా పర్యటనలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే ఇంకా ఎన్నికలకు రెండేళ్లు సమయం ఉండటంతో పొత్తుల అంశం హాట్ టాపిక్ గా మారింది. మరి ఏమేరకు పార్టీలు టీడీపీతో కలిసి వస్తాయే వేచిచూడాల్సిందే..