Chandrababu : బుద్ధి వచ్చిందా చంద్రబాబు?? మొహం మీదనే వార్నింగ్ ఇచ్చిన కుప్పం జనం..!
Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం కుప్పం నియోజకవర్గం మీద దృష్టి పెట్టారు. కుప్పం నడివీధుల్లో తిరుగుతున్నారు. నిజానికి ఆయన ఎప్పుడు టైమ్ దొరికితే అప్పుడు కుప్పానికి వెళ్తున్నారు. కానీ.. తాజాగా ఆయన కుప్పంలో పర్యటించడం చర్చనీయాంశమైంది. ఎందుకంటే.. వచ్చే ఎన్నికల్లో ఏ నియోజకవర్గంలో టీడీపీ ఓడిపోయినా పెద్దగా చంద్రబాబు పట్టించుకోరు కానీ.. కుప్పంలో ఓడిపోతే మాత్రం ఆయన జీర్ణించుకోలేరు. చాలా ఏళ్ల నుంచి అక్కడ ఎప్పుడు ఎన్నికలు జరిగినా అక్కడ టీడీపీ గెలవాల్సిందే. చంద్రబాబు గెలవాల్సిందే. కానీ.. ఇప్పుడు ఆ పరిస్థితులు కుప్పంలో లేవు.
నిజానికి ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా టైమ్ ఉంది. ఇంకో రెండేళ్ల టైమ్ ఉంది. కానీ.. ఇప్పటి నుంచే చంద్రబాబు కుప్పంలో దృష్టి పెట్టాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. మంగళగిరిలో గత ఎన్నికల్లో తన కొడుకు లోకేశ్ బాబు ఓడిపోతే టీడీపీ అభిమానులే జీర్ణించుకోలేకపోయారు. ఇక.. సొంత నియోజకవర్గం కుప్పంలో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోతే ఇంకేమైనా ఉందా. అందుకే ఇప్పటి నుంచే కుప్పంలో ఎక్కువ రోజులు ఉండి కుప్పం సమస్యలపై వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీయాలని చంద్రబాబు డిసైడ్ అయిపోయారు. నెలలో కనీసం ఒక వారం రోజులు అయినా కుప్పంలో పర్యటించాలని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది.
Chandrababu : ధైర్యం ఉంటే వైసీపీ రౌడీలు ఇప్పుడు రండి అంటూ సవాల్ చేసిన చంద్రబాబు
తాజాగా కుప్పంలో పర్యటించిన చంద్రబాబు.. గత రెండు రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలపై స్పందించారు. వైసీపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ గూండాల్లారా ఇప్పుడు రండి అంటూ సవాల్ విసిరారు. పుంగనూరు రౌడీ, డీజీపీ అందరూ కుప్పం రండి. తేల్చుకుందాం. పోలీసులు కాసేపు పక్కన నిలబడితే వైసీపీ రౌడీలు ఎలా వస్తారో నేను చూస్తా. వారి కథ ఏంటో రెండు నిమిషాల్లో తేలుస్తా అని చంద్రబాబు మండిపడ్డారు.
నన్ను కుప్పం రాకుండా అడ్డుకుంటారా? నేను మీకు భయపడాలా? మీరు మా కార్యకర్తలపై చేయి వేస్తే.. నేను మీ ఇంటికి వచ్చి కొడతా. పెద్ద పెద్ద రౌడీలు, గుండాలు, తీవ్రవాదులనే టీడీపీ అణచివేసింది. ఖబడ్దార్ జగన్ రెడ్డి.. నీలాంటి చరిత్ర హీనులను నా ప్రజా జీవితంలో ఇప్పటి వరకు చూడలేదు అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే.. కుప్పం విషయంలో చంద్రబాబు ఎందుకు ఇంతలా ప్రవర్తిస్తున్నారో అర్థం కుప్పం ప్రజలకు కూడా అర్థం కావడం లేదు. కుప్పం విషయంలో చంద్రబాబు ఆందోళన ఎందుకు పడుతున్నట్టు. ఎందుకు టీడీపీ కుప్పంలో నైతిక స్థైర్యాన్ని కోల్పోతుందా? అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది.