Technician Vacancies : ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీ, మెదక్‌లో టెక్నీషియన్ ఖాళీలు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Technician Vacancies : ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీ, మెదక్‌లో టెక్నీషియన్ ఖాళీలు..!

 Authored By ramu | The Telugu News | Updated on :13 November 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Technician Vacancies : ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీ, మెదక్‌లో టెక్నీషియన్ ఖాళీలు..!

Technician Vacancies : ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, మెదక్ (OFMK) జూనియర్ మేనేజర్, డిప్లొమా టెక్నీషియన్, అసిస్టెంట్ & జూనియర్ అసిస్టెంట్ ఖాళీల కోసం ఫిక్స్‌డ్ టెన్యూర్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు మరియు అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Technician Vacancies పోస్టు పేరు- ఖాళీలు..

1. జూనియర్ మేనేజర్ : 50
2. డిప్లొమా టెక్నీషియన్ : 21
3. అసిస్టెంట్ : 11
4. జూనియర్ అసిస్టెంట్ : 04
మొత్తం ఖాళీల సంఖ్య : 86

విభాగాలు : మెకానికల్, ప్రొడక్షన్, క్వాలిటీ, ఇంటిగ్రేటెడ్ మెటీరియల్ మేనేజ్‌మెంట్, ఎలక్ట్రికల్‌, మెటలర్జీ, టూల్ డిజైన్, డిజైన్, క్వాలిటీ అండ్ ఇన్‌స్పెక్షన్‌, హెచ్ఆర్, స్టోర్స్‌ తదితరాలు.

TGCAB : టీజీసీఏబీలో కోఆపరేటివ్ ఇంటర్న్స్

అర్హత :
పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ (బీఏ/బీఎస్సీ/ బీకామ్‌) బీఈ/ బీటెక్, పీజీ (ఎంఏ/ ఎంఎస్సీ/ ఎంకామ్/ ఎంబీఏ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీతం :
నెలకు జూనియర్ మేనేజర్ పోస్టులకు రూ.30,000; డిప్లొమా టెక్నీషియన్ పోస్టులకు రూ.23,000; అసిస్టెంట్ పోస్టులకు రూ.23,000; జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు రూ.21,000.

వయో పరిమితి : 30 ఏళ్లు మించి ఉండకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు :
రూ.300; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్‌ సర్వీస్‌మెన్ / మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా.

Technician Vacancies ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీ మెదక్‌లో టెక్నీషియన్ ఖాళీలు

Technician Vacancies : ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీ, మెదక్‌లో టెక్నీషియన్ ఖాళీలు..!

ఎంపిక ప్రక్రియ :
విద్యార్హతలు, పని అనుభవం, స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్య్వూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు చివరి తేదీ : ప్రకటన వెలువడిన 21 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలి.

ప్రకటన వెలువడిన తేదీ: 11-11-2024.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది