Teenmaar Mallanna : కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న.. సీటు ఫిక్స్ చేసిన రేవంత్ రెడ్డి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Teenmaar Mallanna : కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న.. సీటు ఫిక్స్ చేసిన రేవంత్ రెడ్డి

 Authored By kranthi | The Telugu News | Updated on :31 August 2023,11:00 am

Teenmaar Mallanna : తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ప్రధాన పార్టీలన్నీ సమాయత్తం అవుతున్నాయి. ఇంకా మూడు నెలల్లో తెలంగాణలో ఎన్నికల వేడి ఉంటుంది. ఈనేపథ్యంలోనే ప్రధాన పార్టీలు ఎన్నికల్లో గెలుపు కోసం సర్వం ఒడ్డుతున్నాయి. మూడో సారి గెలిచి హ్యాట్రిక్ సాధించి తమ సత్తా చాటాలని అధికార బీఆర్ఎస్ ఆరాటపడుతుండగా.. ఇక ఒక్క చాన్స్ అంటూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ ప్రజలను కోరుతున్నాయి. ఈనేపథ్యంలో అధికార బీఆర్ఎస్ ను ఢీకొట్టేందుకు బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు బాగానే పోరాడుతున్నాయి.

అయితే.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ కి చెందిన కీలక నేతలు కూడా కాంగ్రెస్ లో చేరుతున్నారు. బీజేపీలోని కీలక నేతలు కూడా కాంగ్రెస్ లోనే చేరుతున్నారు. దీంతో కాంగ్రెస్ కు బలం రోజురోజుకూ పెరుగుతోంది. కర్ణాటకలోనూ కాంగ్రెస్ పార్టీ గెలుపుతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్నాయి. అదే ఊపుతూ తెలంగాణలోనూ విజయం సాధించి మరోసారి కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటాలని భావిస్తోంది. అందుకే ఈసారి 119 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపేందుకు ట్రై చేస్తోంది.

teenmaar mallanna as congress candidate

Teenmaar Mallanna : కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న.. సీటు ఫిక్స్ చేసిన రేవంత్ రెడ్డి

Teenmaar Mallanna : మంత్రి మల్లారెడ్డికి పోటీగా తీన్మార్ మల్లన్న

అన్ని రకాలుగా సమాయత్తం అవుతూ అందరినీ కలుపుకుపోతోంది కాంగ్రెస్. గతంలో తమ పార్టీలో పని చేసిన తీన్మార్ మల్లన్నను మరోసారి ఆహ్వానిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన ఇప్పటికే కొత్త పార్టీ పెట్టారు. ఆ పార్టీ తరుపున పోటీ చేస్తారని అనుకున్నారు. కానీ.. సొంతంగా పోటీ చేయడం కంటే హస్తం పార్టీ నుంచి పోటీ చేస్తే బాగుంటుందన్న ఆలోచనలో మల్లన్న ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి మల్లన్న పోటీ చేస్తే విజయం ఖాయం అనేది తెలుస్తోంది. మల్లారెడ్డి లాంటి అభ్యర్థిని ఢీకొట్టాలంటే మల్లన్న లాంటి క్యాండిటేట్ అయితేనే కరెక్ట్ అని కాంగ్రెస్ కూడా భావిస్తోందట. మంత్రి మల్లారెడ్డిని ఓడించాలంటే బలమైన నేత ఉండాలని కాంగ్రెస్ అనుకుంటోంది. అయితే.. మేడ్చల్ నియోజకవర్గంలో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత పోరు నడుస్తోంది. మేడ్చల్ లో మల్లారెడ్డి, సుధీర్ రెడ్డి మధ్య అంతర్గత పోరు నడుస్తున్న నేపథ్యంలో ఈ గ్యాప్ ను సానుకూలంగా మార్చుకొని అక్కడ కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఫస్ట్ నుంచి మల్లారెడ్డి మీద తీన్మార్ మల్లన్న ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. అందుకే నేరుగా మేడ్చల్ లో మల్లారెడ్డిని మల్లన్న ఢీకొట్టబోతున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి మల్లన్నను పోటీ చేయిస్తే మేడ్చల్ సీటు కాంగ్రెస్ ఖాతాలో పడినట్టే లెక్క.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది