Revanth Reddy : రేవంత్ రెడ్డి స్కెచ్ మాములుగా లేదు.. హ‌రీష్ త‌ర్వాత టార్గెట్ కేటీఆర్, కేసీఆర్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Revanth Reddy : రేవంత్ రెడ్డి స్కెచ్ మాములుగా లేదు.. హ‌రీష్ త‌ర్వాత టార్గెట్ కేటీఆర్, కేసీఆర్..!

 Authored By ramu | The Telugu News | Updated on :20 January 2026,10:00 pm

ప్రధానాంశాలు:

  •  Revanth Reddy : రేవంత్ రెడ్డి స్కెచ్ మాములుగా లేదు.. హ‌రీష్ త‌ర్వాత టార్గెట్ కేటీఆర్, కేసీఆర్..!

Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల గులాబీ పార్టీపై చేసిన ఘాటైన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. గులాబీ పార్టీ గద్దెలు పూర్తిగా కూలాలనీ, ఆ పార్టీని వంద మీటర్ల లోతులో పాతిపెట్టాలని ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో రాజకీయ ఆవేశంలో భాగమేనని చాలామంది భావించారు. అయితే ఆ వ్యాఖ్యల వెనుక లోతైన రాజకీయ వ్యూహం, పరిపాలనా చర్యలు ఉన్నాయన్న విషయం ఇప్పుడు స్పష్టమవుతోంది. ఖమ్మం సభలో రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మాట్లాడిన అనంతరం, కేవలం ఒక్కరోజు గ్యాప్‌లోనే గులాబీ పార్టీకి ఆ పరిణామాల తీవ్రత అర్థమయ్యేలా పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం మరోసారి సక్రియమై, ఈసారి మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు జారీ చేసింది.

Revanth Reddy రేవంత్ రెడ్డి స్కెచ్ మాములుగా లేదు హ‌రీష్ త‌ర్వాత టార్గెట్ కేటీఆర్ కేసీఆర్

Revanth Reddy : రేవంత్ రెడ్డి స్కెచ్ మాములుగా లేదు.. హ‌రీష్ త‌ర్వాత టార్గెట్ కేటీఆర్, కేసీఆర్..!

Revanth Reddy రేవంత్ ఆన్ ఫైర్..

సోమవారం రాత్రి సీఆర్పీఎస్ సెక్షన్ 160 కింద జారీ చేసిన ఈ నోటీసుల ప్రకారం, మంగళవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని సూచించారు. జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి స్వయంగా ఈ నోటీసులను హరీష్ రావుకు అందించారు. గులాబీ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి పదేపదే ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత కూడా తన భర్త ఫోన్ సహా కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాప్ చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ప్రభుత్వం దూకుడు పెంచింది. గత ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎవరు లాభపడ్డారు, నాటి పాలకుల కోసం పనిచేసిన అధికారులు ఎలాంటి ప్రయోజనాలు ఆశించారు అనే అంశాలను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రత్యేక దర్యాప్తు బృందం ముందుకు సాగుతోంది.

హరీష్ రావుకు నోటీసులు ఇవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది. ఈ కేసులో ముందుగా హరీష్ రావును, ఆ తర్వాత కేటీఆర్‌ను, అనంతరం కేసీఆర్‌ను కూడా విచారణకు పిలిచే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు అధికారులను, ఇతరులను విచారించిన సిట్, సేకరించిన సమాచారం ఆధారంగానే హరీష్ రావుకు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. విచారణలో ఆయన స్టేట్మెంట్‌ను రికార్డు చేయనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, గతంలోనే తనకు నోటీసులు వస్తాయని హరీష్ రావు వ్యాఖ్యానించిన విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పంచాయతీ ఎన్నికలకు ముందు ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చారని, ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో తనకు కూడా ఇస్తారని ఆయన అప్పుడే పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాజకీయ నాయకుల ప్రత్యక్ష ప్రమేయం ఉండదని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే అది జరుగుతుందని కూడా హరీష్ రావు గతంలో వ్యాఖ్యానించారు. అయితే ఈ కేసులో మొదటి నుంచే కేసీఆర్ పేరు వినిపిస్తుండగా, త్వరలోనే ఆయనకు కూడా నోటీసులు జారీ చేసి విచారణకు పిలుస్తారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది