Teenmaar Mallanna : బరాబర్ వస్తా.. ప్రగతి భవన్ గోడలు బద్దలు కొడతా.. కేసీఆర్ కు తీన్మార్ మల్లన్న వార్నింగ్?
Teenmaar Mallanna : తీన్మార్ మల్లన్న గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఆయన తెలంగాణ ప్రజల బాగు కోసం.. వాళ్ల సంక్షేమం కోసం ఏకంగా ప్రభుత్వంతోనే పోరాడుతున్నారు. జర్నలిస్టుగా తన జీవితాన్ని ప్రారంభించిన మల్లన్న.. ప్రస్తుతం క్యూ న్యూస్ అనే యూట్యూబ్ చానెల్ వేదికగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను బయటపెడుతున్నారు.

teenmaar mallanna shocking comments on cm kcr
సీఎం కేసీఆర్ తో పాటు మంత్రి కేటీఆర్, ఇతర మంత్రులు, టీఆర్ఎస్ నేతలు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని.. వాటికి సంబంధించిన ఎన్నో ఆధారాలను చాలాసార్లు క్యూ న్యూస్ చానెల్ ద్వారా తెలంగాణ ప్రజల ముందుకు తీసుకొచ్చారు మల్లన్న.
ఇంకా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు మల్లన్న. కానీ.. రెప్ప పాటులో ఆయన ఓడిపోయారు. టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా చేతిలో తక్కువ మెజారిటీతో మల్లన్న ఓడిపోయారు. ఒక స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి… ఏమాత్రం మద్దతు లేకున్నా.. ఎవరూ సహకరించకున్నా.. ఒక్కడే ముందుకు నడిచి.. ముందడుగు వేసి.. గ్రాడ్యుయేట్లను తనకు ఓట్లేయాలంటూ అభ్యర్థించారు. ఏకంగా టీఆర్ఎస్ అభ్యర్థితోనే ఢీకొని.. గట్టిపోటీ ఇవ్వడమంటే మామూలు విషయం కాదు. కానీ.. దాన్ని సుసాధ్యం చేశారు మల్లన్న.
Teenmaar Mallanna : ఓటమి తర్వాత కేసీఆర్ పై విరుచుకుపడిన మల్లన్న
అయితే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చి ఓటమి చెందిన తర్వాత తీన్మార్ మల్లన్న తాజాగా మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీపై విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేవారు.
మళ్లీ బరాబర్ వస్తా… ప్రగతి భవన్ గోడలు బద్ధలు కొడతా. ఈ ఎన్నికల్లో ప్రభుత్వం ఎన్ని అక్రమాలకు పాల్పడిందో అందరికీ తెలుసు. అన్ని అక్రమాలను నేను బయటపెట్టా. ఇంకా బయటపెడతా. ఎంత ఒత్తిడి ఉన్నా… చివరి క్షణం వరకు పోరాడా. ఇంకా పోరాడుతూనే ఉంటా.. కేసీఆర్.. ప్రజల గొంతును డబ్బులతో అడ్డుకుంటున్నావా? బరాబర్ వస్తా. ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టే రోజు తొందరలోనే ఉంది.. అంటూ సీఎం కేసీఆర్ కు మల్లన్న వార్నింగ్ ఇచ్చారు.