Vijayashanthi : తెలంగాణ కాంగ్రెస్ కు మరో షాక్ ఇవ్వబోతున్న విజయశాంతి? తెలంగాణలో కాంగ్రెస్ ఖేల్ ఖతమే ఇక?
కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ ఇచ్చి మరీ.. బీజేపీలో చేరింది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ కు భారీ షాక్ తగిలింది. విజయశాంతి పార్టీ నుంచి వెళ్లడంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు ఏర్పడింది. ఇప్పటికే పార్టీకి అంతంతమాత్రమే ప్రజల్లో ఆదరణ ఉంటే.. టాప్ క్లాస్ లీడర్, ఫైర్ బ్రాండ్ అయిన విజయశాంతి పార్టీ నుంచి వెళ్లిపోవడంతో పార్టీకి మరింత లోటు ఏర్పడింది…
తాజాగా బయటికి వచ్చిన విషయం ఏంటంటే.. మరికొందరు కాంగ్రెస్ నేతలు విజయశాంతి బీజేపీలోకి చేర్చుకోనున్నదట. అవును.. కాంగ్రెస్ లో ఉన్నదే ఇక ముగ్గురు నలుగురు సీనియర్ నేతలు. వాళ్లను కూడా తన పార్టీలోకి చేర్చుకోవాలని విజయశాంతి తెగ ఆరాటపడుతున్నారట. విజయశాంతికి కాంగ్రెస్ లో సన్నిహితంగా ఉన్న నేతలు చాలామందే ఉన్నారు. వాళ్లకు బీజేపీ నుంచి పలుసార్లు కాల్స్ కూడా వెళ్లాయట…
టీఆర్ఎస్ నేతలను కూడా లాక్కునేందుకు జోరుగా ప్రయత్నాలు
కాంగ్రెస్ నేతలే కాదు.. టీఆర్ఎస్ నేతలను కూడా బీజేపీలోకి లాక్కునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. బీజేపీ అధిష్ఠానం రాములమ్మకు అన్ని పవర్స్ ఇచ్చేయడంతో.. పార్టీని బలోపేతం చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే వరంగల్ జిల్లాకు చెందిన పలువురు టీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరేందుకు రంగం కూడా సిద్ధం చేసుకుంటున్నారట.
వరంగల్ జిల్లాతో పాటు మెదక్ జిల్లా నేతలు కూడా బీజేపీలో చేరేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే.. బీజేపీలో విజయశాంతి చేరినప్పటికీ ఇంకా తనకు ఏ పదవీ ఇవ్వలేదు. తనకు మెదక్ పార్లమెం ఇన్ చార్జ్ పదవిని కట్టబెట్టేందుకు బీజేపీ యోచిస్తోందట. రాములమ్మ కూడా తనకు కీలక పదవి కావాలని.. అధిష్ఠానాన్ని కోరింది. ఒకవేళ తనకు కోరుకున్న పదవి వస్తే.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కు చెందిన పలువురు నేతలు వెంటనే బీజేపీలోకి జంప్ అవడానికి సిద్ధంగా ఉన్నారట. ఏది ఏమైనా రాములమ్మ.. బీజేపీ పార్టీని తెలంగాణలో బలోపేతం చేయడం కోసం చాలానే కష్టపడుతోంది.