Telangana : తెలంగాణలో ఆరు స్థానాలకు ఉప ఎన్నికలట.!
Telangana : మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఆసక్తికరమైన రాజకీయ జోస్యం చెప్పారు. తెలంగాణలో రానున్న రోజుల్లో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతాయని చెప్పారయన. ప్రస్తుతం బీజేపీలో వున్నారు. హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గత ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి గెలిచి, కేసీయార్ మంత్రి వర్గంలో కీలకమైన మంత్రిగా పదవి నిర్వహించిన ఈటెల రాజేందర్ అనూహ్యంగా కేసీయార్ ఆగ్రహానికి గురయ్యారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి బయటకు వచ్చి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ నుంచి గెలిచారాయన. అలా టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కాస్తా, బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అయ్యారు. కానీ, బీజేపీలో నిలదొక్కుకోవడం ఒకింత కష్టంగా మారింది ఈటెల రాజేందర్‌కి.
ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై కన్నేశారు. కేసీయార్‌ని ఓడించకపోతే, తన రాజకీయ జీవితానికే అర్థం లేదన్నట్లు ఈటెల రాజేందర్ మాట్లాడుతూ అందర్నీఆశ్చర్యపరుస్తున్నారు. ఒకప్పుడు ఇదే ఈటెల రాజేందర్, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావుని దేవుడిగా కొలిచిన సంగతి తెలిసిందే. రాజకీయాలు అలాగే వుంటాయ్ మరి.!కాగా, తెలంగాణలో ఆరు ఉప ఎన్నికలు రాబోతున్నాయంటూ ఈటెల రాజేందర్ చెప్పిన జోస్యం సంచలనంగా మారింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి సహా, పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా బీజేపీతో టచ్‌లో వున్నారని ఈటెల రాజేందర్ అంటున్నారు.
బాహుశా ఎక్కుమంది ఎమ్మెల్యేలను బీజేపీలోకి లాగాలంటూ, బీజేపీ అధిష్టానం ఈటెల రాజేందర్‌కి ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగించిందేమో.! తెలంగాణలో అధికారంలో వున్న తెలంగాణ రాష్ట్ర సమితిని కాదని, భారతీయ జనతా పార్టీలో గులాబీ నేతలెవరూ చేరే అవకాశం వుండదు ఇప్పట్లో. ఎన్నికలు సమీపిస్తే, అప్పుడు రాజకీయాలు మారొచ్చు. రాజకీయ ఆలోచనలు భిన్నంగా వుండొచ్చు కూడా. ఆరు స్థానాలకు ఉప ఎన్నికలంటే, అంత సీన్ వుండకపోవచ్చని ఈటెల రాజేందర్‌కి తెలియదా.? ఆ పరిస్థితే వస్తే, కేసీయార్ ముందస్తు ఎన్నికలకే వెళతారు కదా.? కేసీయార్ గురించి అన్నీ తెలిసీ, ఈటెల రాజేందర్ ఇంత తేలికపాటి వ్యాఖ్యలు ఎలా చేయగలిగారబ్బా.?