KCR : కేసీఆర్ అసలు ప్లాన్ అదే.. ఈటలపై గురి పెట్టడానికి కారణం కూడా దాని కోసమే?
KCR : కేసీఆర్.. తెలంగాణ ముఖ్యమంత్రిగానే కాదు.. ఒక రాజకీయ చాణక్యుడిలా ఆలోచిస్తారు. అదే ఆయనకు ఆయువు పట్టు. కేసీఆర్ లా రాజకీయాల్లో ముందడుగు వేసేవాళ్లు మరొకరు లేరు. రాజకీయాల్లో ఆయన పండితుడు. ఎలా ఎటువంటి స్టెప్ వేస్తే.. ఏమౌతుంది. ఎవరిని టార్గెట్ చేస్తే ఎవరు సెట్ అవుతారు.. ఇలా అన్నింట్లో ఆరితేరిన మనిషి కేసీఆర్. అందుకే.. కేసీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అసలు.. వస్తదో రాదో అని అనుకున్న తెలంగాణను సాధించి తానేంటో నిరూపించారు. అందుకే కేసీఆర్ ను అందరూ అసాధ్యుడు అంటారు.
ప్రత్యర్థుల గుండెల్లో నిద్రపోయి.. వాళ్లకు నిద్రలు లేకుండా చేసేటువంటి వ్యూహాలు పన్నడంలో కేసీఆర్ దిట్ట. ఇటీవల జరిగిన ఘటనే దానికి ఉదాహరణ. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి కేసీఆర్ వెంటనే ఉన్నారు ఈటల రాజేందర్. ఆయనకు అత్యంత ఆప్తుడు కూడా. అటువంటి ఈటలనే టార్గెట్ చేసి.. మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేసి ఏకాకిని చేసిన ఘనత కేసీఆర్ ది. అందుకే.. కేసీఆర్ ఎప్పుడు ఎటువంటి అడుగు వేస్తారు అనేది ఎవ్వరూ ఊహించలేరు అంటారు.
ఈటల రాజేందర్ బీసీ నాయకుడు అయినప్పటికీ.. తెలంగాణలో మంచి పేరు ఉన్నదని తెలిసినప్పటికీ.. కేసీఆర్ మాత్రం ఆయన్ను మంత్రి వర్గం నుంచి తొలగించేశారు. అది కూడా ఉద్యమ కాలం నుంచి ఉన్న నేతను. ఈటల వల్ల పార్టీకి నష్టం కలుగుతుంది అని కేసీఆర్ భావించలేదా? అంటే.. కేసీఆర్ అన్నింటినీ తెలుసుకొని అడుగు ముందుకు వేశారు. ఈటలను పార్టీ నుంచి బయటికి వెళ్లగొట్టడం వల్ల.. కేసీఆర్ కే లాభమట. అవును.. రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారంటే… ఈటలను రెచ్చగొట్టి మరీ.. బయటికి పంపించేశారు. రేపు ఈటల కొత్త పార్టీ పెట్టినా.. వేరే పార్టీలో చేరినా.. ఇంకేం చేసినా..అది కేసీఆర్ కే ప్లస్ అవుతుంది.. టీఆర్ఎస్ కే లాభం చేకూరుతుందంటున్నారు.
KCR : రాజకీయాల్లో శత్రువులే ఎక్కువుండాలి అనే ఫార్ములాతో ముందుకెళ్తున్న కేసీఆర్
అవును.. రాజకీయాల్లో మిత్రుల కన్నా శత్రువులే ఎక్కువగా ఉండాలట. అప్పుడే రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయట. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్ కు బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీలు శత్రువులుగా ఉండగా.. ప్రస్తుతం కొత్త శత్రువు వచ్చాడు. ఆయనే ఈటల రాజేందర్. ఈటల ఎంత తొందరపడి.. పార్టీ పెట్టినా.. వేరే పార్టీలో చేరినా.. టీఆర్ఎస్ పార్టీకి ఒరిగే నష్టం ఏముండదట. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణలో ఉన్నాయి తప్పతే వాటికి గెలిచేంత సీన్ లేదు. కొత్తగా షర్మిల కూడా పార్టీ అంటోంది కానీ.. ఆమె పార్టీ పెట్టినా.. ఓట్లు చీలడం తప్పితే ఇంకేం ఉండదు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఓట్లు చీలి.. టీఆర్ఎస్ లాభం కలిగించడమే. ఈటల పార్టీ పెట్టినా.. బీజేపీ, కాంగ్రెస్ ల ఓట్లు చీలి.. టీఆర్ఎస్ కు ప్లస్ అవుతుందని.. కేవలం.. ప్రభుత్వ ఓట్లను చీల్చడం కోసమే, 2023 ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించడం కోసమే.. కేసీఆర్ ఈ ప్లాన్ చేస్తున్నారు.. ఈ వ్యూహాలు రచిస్తున్నారు అనే వార్తలు ప్రస్తుతం తెలంగాణ పొలిటికల్ సర్కిల్ లో షికారు చేస్తున్నారు. అంటే 2023 ఎన్నికల్లో మరోసారి గెలిచి.. హ్యాట్రిక్ సాధించి.. తమ సత్తా చాటాలని.. ఇప్పటి నుంచే కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారన్నమాట.