మోడీ మీద కే‌సీ‌ఆర్ బ్రహ్మాస్త్రం, ఐడియా ఇచ్చింది జగనే ?? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

మోడీ మీద కే‌సీఆర్ బ్రహ్మాస్త్రం, ఐడియా ఇచ్చింది జగనే??

 Authored By jagadesh | The Telugu News | Updated on :15 January 2021,11:57 am

నార్త్ లో ఎలాగూ బీజేపీ పార్టీ పాతుకుపోయింది. కానీ.. సౌత్ లో బీజేపీకి అంత సీన్ లేదు. అని అంతా అనుకున్నారు. సౌత్ రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేయాలంటూ చాలా కష్టం అని రాజకీయ విశ్లేషకులు కూడా భావించారు. కానీ.. సీన్ అంతా రివర్స్ అయిపోయింది. దేశమంతా బీజేపీ చాపకింద నీరులా త్వరగా విస్తరిస్తోంది. దీంతో ప్రాంతీయ పార్టీలతో పాటు ఇతర జాతీయ పార్టీలు కూడా తలలు పట్టుకుంటున్నాయి.

telangana cm kcr master plan to target bjp

telangana cm kcr master plan to target bjp

ఇప్పటికే సౌత్ లో కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉంది. తెలంగాణలోనూ దూసుకుపోతోంది. ఏపీలో కూడా అంతే. తమిళనాడులో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న కసి మీద ఉంది. సరే… వేరే రాష్ట్రాల గురించి పక్కన పెడదాం కానీ.. తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటి?

ఓవైపు తెలంగాణలో ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ దూకుడును కట్టడి చేసి అధికారంలోకి రావడం కోసం బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. మరోవైపు జమిలీ ఎన్నికలు అనే కొత్త అస్త్రాన్ని బీజేపీ ముందుకు తీసుకొచ్చింది. జమిలి ఎన్నికలను 2022లో నిర్వహించేందుకు సన్నద్దం అవుతోంది.

ఒకవేళ జమిలి ఎన్నికలు వస్తే.. తెలంగాణలో ప్రస్తుత పరిస్థితుల్లో టీఆర్ఎస్ నెగ్గుకురావడం కష్టమే. ఎందుకంటే.. ఇప్పటికే వరుసగా ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి చెందుతోంది. తెలంగాణ ప్రజలు కూడా టీఆర్ఎస్ పై వ్యతిరేకతతో ఉన్నారు.

అందుకే తెలంగాణ సీఎం కేసీఆర్ కాస్త పరిణతితో ఆలోచిస్తున్నారు. డైరెక్ట్ గా ప్రధాని మోదీ మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించబోతున్నారు. మామూలుగా అయితే 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. కానీ.. ఈసారి మాత్రం జమిలీ ఎన్నికలు వస్తే 2022 లోనే ఎన్నికలు వస్తాయి. 2022లోనే వస్తే.. అప్పుడు టీఆర్ఎస్ ఎలా ఎదుర్కోవాలి. ఎలా అధికారంలోకి రావాలి.. అనేదానిపై కేసీఆర్ ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నారు.

కేటీఆర్ ఇక ముఖ్యమంత్రి పీఠం ఎక్కనట్టే

ఎలాగూ జమిలీ ఎన్నికలకు ఇంకా రెండేళ్లే ఉన్నందున.. ఇప్పుడు కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేస్తే ఆ ప్రభావం వచ్చే ఎన్నికల మీద ఉంటుందని.. అందుకే.. కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేసే విషయంపై కేసీఆర్ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. తానే ముఖ్యమంత్రిగా ఉండి.. 2022లో టీఆర్ఎస్ పార్టీని గెలిపించి.. అప్పుడు ముఖ్యమంత్రి పీఠాన్ని కేటీఆర్ కు అప్పగించాలని కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు.

Tags :

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది