KCR : కేసీఆర్ రాజకీయ కెరీర్ కే అతిపెద్ద ఛాలెంజ్ ఈ రోజు !!
KCR : టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అయింది. తెలంగాణ సీఎం కేసీఆర్ కాస్త దేశ నేత అయిపోయారు. తెలంగాణను పక్కన పెట్టి మరీ.. దేశవ్యాప్తంగా రాజకీయాలు చేయాలని సీఎం కేసీఆర్ తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే తొలి సారి బీఆర్ఎస్ పార్టీ స్థాపించిన తర్వాత తెలంగాణ కాకుండా వేరే రాష్ట్రంలో మీటింగ్ పెడుతున్నారు కేసీఆర్. ఈ మీటింగ్ ను మహారాష్ట్రలోని నాందేడ్ లో నిర్వహిస్తున్నారు సీఎం కేసీఆర్. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి నో డౌట్. ఏపీలో ఇప్పుడిప్పుడే పలువురు నేతలు బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు.
ఇక మిగిలింది తెలంగాణకు ఆనుకొని ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలు. ముందు ఈ రాష్ట్రాల్లో పాగా వేసిన తర్వాత ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ ప్లాన్స్ చేస్తున్నారు. అందుకే ఒక్కో రాష్ట్రంలో పట్టు పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే నాందేడ్ లోని ఈరోజు మీటింగ్. ఈ సభ సక్సెస్ అయితేనే బీఆర్ఎస్ పార్టీకి పేరు, పలుకుబడి వచ్చేది. మహారాష్ట్రకు ఆనుకొని ఉన్న నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి తెలంగాణ ప్రజలను ఈ సభకు తరలించేందుకు భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ సన్నాహాలు చేస్తోంది.
KCR : భారీగా జనాలను తరలిస్తారా?
ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నేతలంతా నాందేడ్ లో మకాం వేశారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దగ్గరుండి సభ ఏర్పాట్లను చూసుకుంటున్నారు. నాందేడ్ ప్రాంతంలో ఎక్కడ చూసినా బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు దర్శనం ఇస్తున్నాయి. మరాఠీ భాషలో ఫ్లెక్సీలను తయారు చేయించారు. ఈ సభలో చాలామంది మహారాష్ట్రకు చెందిన నేతలు పార్టీలో చేరుతున్నట్టు తెలుస్తోంది. వాళ్లను పార్టీలోకి ఆహ్వానించిన తర్వాత సభను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత జాతీయ మీడియాతో ప్రెస్ మీట్ ను కేసీఆర్ నిర్వహించనున్నారు. తర్వాత సాయంత్రం తిరిగి హైదరాబాద్ కు వచ్చేస్తారు.