KCR BRS Party : బీఆర్ఎస్ పార్టీ పెట్టిన కొన్ని గంటలకే హరీష్ రావుకి ఝలక్ ఇచ్చిన కేసీఆర్
KCR BRS Party : తెలంగాణలో ప్రస్తుతం రాజకీయాలు చాలా హీటెక్కాయి. సీఎం కేసీఆర్ దసరా సందర్భంగా ప్రకటించిన జాతీయ పార్టీ బీఆర్ఎస్ గురించే అందరూ చర్చిస్తున్నారు. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ గురించి జాతీయ స్థాయిలో చర్చ నడుస్తోంది. ఇప్పటికే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ రెండు సార్లు గెలిచింది. రెండు సార్లు గెలిచిన ఉత్సాహంతో మూడో సారి కూడా తెలంగాణలో అధికారం చేపట్టాలని టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తోంది. అలాగే జాతీయ స్థాయిలోనూ రాణించాలని సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించారు.
తెలంగాణను వదిలేయకుండానే జాతీయ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసేందుకు కేసీఆర్ ప్లాన్స్ వేస్తున్నారు. ఈసందర్భంగా టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా కేసీఆర్ మార్చిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా బీఆర్ఎస్ పార్టీ పోస్టర్లే. కానీ.. ఆ పార్టీ పోస్టర్లు, హోర్డింగ్స్ లో ఎక్కడా మంత్రి హరీశ్ రావు ఫోటోలు లేవు. దీన్ని బట్టి చూస్తే హరీశ్ రావును కేసీఆర్ ఎప్పుడో సైడ్ చేశాడని స్పష్టం అవుతోంది. తెలంగాణ సాధనలో హరీశ్ రావు పాత్ర ఎనలేనిది.
KCR BRS Party : కొడుకు కేటీఆర్ కు పోటీగా ఉన్నారనా?
అందులోనూ సీఎం కేసీఆర్ తర్వాత టీఆర్ఎస్ లో అంతటి ప్రాధాన్యత ఉన్నది హరీశ్ రావుకే. కానీ.. హరీశ్ రావు.. తన సొంత కొడుకు కేటీఆర్ ఎదుగుదలకు అడ్డు వస్తున్నారని భావించిన సీఎం కేసీఆర్ హరీశ్ రావును చాలా రోజుల నుంచి పక్కన పెడుతున్నట్టు తెలుస్తోంది. అందుకే.. జాతీయ పార్టీని ప్రకటించినప్పటికీ ఎక్కడా హరీశ్ రావు ఫోటోలు లేకుండా హరీశ్ ను కేవలం తెలంగాణకే పరిమితం చేసేందుకు కేసీఆర్ ఈ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.