CM KCR : తన వెనుక గోతులు తవ్వుతున్న నేతల వల్ల.. అడ్డంగా బుక్కయిపోయిన కేసీఆర్? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

CM KCR : తన వెనుక గోతులు తవ్వుతున్న నేతల వల్ల.. అడ్డంగా బుక్కయిపోయిన కేసీఆర్?

 Authored By jagadesh | The Telugu News | Updated on :26 May 2021,4:58 pm

CM KCR : ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఎక్కువయ్యాయి. ఒకరిని మరొకరు తిట్టడం, ఆరోపణలు చేసుకోవడం ఒక ఎత్తు అయితే.. కొందరు నేతలు ఏకంగా సీఎం కేసీఆర్ కే ఎగనామం పెడుతున్నారు అనే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే.. కేసీఆర్ కు తెలియకుండా తెలివిగా గోతులు తీస్తూ తప్పించుకుంటున్న వాళ్లు కూడా ఉన్నారట. వీళ్ల వల్ల టీఆర్ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్ కు లేనిపోని తలనొప్పులు వస్తున్నాయని.. ఆయన అడ్డంగా బుక్కయిపోతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

telangana cm kcr trs party

telangana cm kcr trs party

నిజానికి.. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ ఫోకస్ పెట్టాల్సింది కరోనా కట్టడి మీద. ప్రస్తుతం కరోనా ఎలా వ్యాప్తి చెందుతోందో అందరికీ తెలిసిందే. కరోనా వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సీఎం కేసీఆర్ కూడా ఎక్కువగా కరోనా నియంత్రణలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈనేపథ్యోం కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు తమ పని కానిస్తున్నారు. కేసీఆర్ ను అడ్డంగా బుక్ చేస్తున్నారు. ఇప్పటికే మెదక్ జిల్లా అచ్చంపేట భూకబ్జా వ్యవహారంలో ఈటల రాజేందర్ ను మంత్రి వర్గం నుంచి కేసీఆర్ బర్తరఫ్ చేశారు. ఆయన ఒక్కరే కాదు.. ఇంకా చాలామంది ఇలాంటి భూకబ్జా వ్యవహారాల్లో ఉన్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఒక్క ఈటల మీదనేనా మీ ప్రతాపం. మిగితా మంత్రులు, ఎమ్మెల్యేలు ఏమైనా శుద్ధపూసలా? వాళ్లపై కూడా విచారణ జరిపించండి. వాళ్లను కూడా మంత్రి వర్గం నుంచి, పార్టీ నుంచి తొలగించండి.. అంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.

CM KCR : ఆరోపణలు వస్తున్న మంత్రులందరిపై విచారణ జరిపించాలి

ఈటల రాజేందర్ మాత్రమే కాదు.. మంత్రి మల్లారెడ్డి ఏమన్నా తక్కువ తిన్నారా? ఆయనపై భూకబ్జాకు సంబంధించిన చాలా ఆరోపణలు వస్తున్నాయి. మంత్రి పువ్వాడ విషయంలోనూ అంతే.. వాళ్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.. అంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. తాజాగా ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి పైన కూడా భూకబ్జా ఆరోపణలు వచ్చాయి. 90 ఎకరాల భూమికి సంబంధించి.. తనను ఎమ్మెల్యే డబ్బులు అడిగారని.. కాప్రాకు చెందిన ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. హైకోర్టుకు కూడా వెళ్లారు.

దీంతో ఎమ్మెల్యే సుభాష్ రెడ్డితో పాటు కాప్రా ఎమ్మార్వో గౌతమ్ కుమార్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం సుభాష్ రెడ్డిపై విచారణ జరుగుతోంది. ఒక్క సుభాష్ రెడ్డి మాత్రమే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఎమ్మెల్యేలు ఇలాగే భూకబ్జాకు పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయం సీఎం కేసీఆర్ దాకా కూడా వెళ్లిందట. కానీ.. ఈ పరిస్థితుల్లో అందరిపై విచారణ జరిపించాలంటూ ఆదేశాలు ఇస్తే.. పార్టీ పరువు పోతుందని భావిస్తున్నారట. ఇప్పటికే ఈటలను భూకబ్జా విషయంలో ఏం చేశారో అందరికీ తెలుసు. కనీసం ఈటల పరిస్థితి చూసి అయినా.. మిగితా వాళ్లు బుద్ధి తెచ్చుకుంటారేమో అని సీఎం కేసీఆర్ భావించారని తెలుస్తోంది. కానీ.. భూకబ్జా ఆరోపణలు మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. దీనిపై సీఎం కేసీఆర్ ఎలా ముందడుగు వస్తారో? చిక్కుల్లో నుంచి ఎలా బయటపడతారో వేచి చూడాల్సిందే.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది