Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్ ను ఏ ఒక్కరు బాగు చేయలేరు.. మరీ ఇలాంటోళ్లు ఉన్నారేంట్రా బాబు
Telangana Congress : భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలో కాంగ్రెస్ పార్టీతో పోటీ పడే సమవుజ్జీ పార్టీ ఏ ఒక్కటి లేదు. కనుక సుదీర్ఘ కాలం పాటు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ జోరు కొనసాగింది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి అద్భుతమైన విజయాలు స్వాతంత్రానంతరం పాతిక ముప్పై సంవత్సరాల వరకు కొనసాగాయి. కానీ మెల్ల మెల్లగా రాష్ట్రాల్లో అధికారాలు చేరుతూ వచ్చాయి. ప్రాంతీయ పార్టీలు పుట్టుకు రావడంతో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దిగజారుతూ వచ్చింది. ఇప్పుడు కేవలం రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పరిమితమై పోయింది. జాతీయ స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పార్టీని బలోపేతం చేయడం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆ ప్రయత్నాలు సఫలం కావడం లేదు.
ఏ విధంగా అయితే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు ఉన్నాయో అంతకు మించి అన్నట్లుగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఉంది. రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి రాబోయే పాతిక సంవత్సరాల వరకు ఎలాంటి డోకా ఉండదు అని సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఊహించి ఉంటారు. కానీ ఆమె ఊహ తల కిందులైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవిని కట్టబెట్టినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికి కూడా ఆయన సీనియర్ల నుండి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు.
కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నా కూడా సీనియర్లు అందుకు అడ్డంపడే ప్రయత్నాలు చేస్తున్నారు. వి హనుమంత రావు మొదలుకుని జగ్గారెడ్డి వరకు ఎంతో మంది కాంగ్రెస్ కు చెందిన నాయకులు రేవంత్ రెడ్డి ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన ఏం చేసినా కూడా అడ్డు పడుతున్నారు. దాంతో రేవంత్ రెడ్డి పార్టీని బలోపేతం చేయలేక పోతున్నారు అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉంది. ఆ పార్టీ యొక్క ముఖ్య నాయకులు స్వయంగా ఈ పరిస్థితికి కారణం అవుతున్నారు.. పార్టీని రాష్ట్రంలో బాగు చేయడం ఏ ఒక్కరి తరం కాదు అన్నట్లుగా సినియర్ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.