Big Breaking : రేవంత్ రెడ్డి కేబినేట్ లో 11 మంది మంత్రులు.. ఇదిగో లిస్టు.. ఊహించని నేతలకు మంత్రి పదవి
ప్రధానాంశాలు:
రాజ్ భవన్ కు చేరిన మంత్రుల పేర్లు
సీఎం, డిప్యూటీ సీఎంతో కలిపి 12 మంది ప్రమాణ స్వీకారం
డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క
Big Breaking : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కాసేపట్లో కొలువు తీరబోతోంది. ఎల్బీ స్టేడియం వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ కొలువు తీరనుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అలాగే.. రేవంత్ రెడ్డి కేబినేట్ లో 11 మంది మంత్రులు ఉండనున్నారు. రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా ఇవాళే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అలాగే.. డిప్యూటీ సీఎం ప్రమాణం కూడా ఈరోజే ఉండనుంది. ముఖ్యమంత్రిగా రేవంత్ ను ముందే ప్రకటించింది కాంగ్రెస్ హైకమాండ్. ఇక.. డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్కను హైకమాండ్ ఖరారు చేసింది. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు నాయకులకు, తెలంగాణకు చెందిన నాయకులకు కూడా ఆహ్వానం వెళ్లింది. ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ ఎల్లా హోటల్ లో ఉన్నారు. వాళ్లందరూ ఎల్లా హోటల్ నుంచి నేరుగా బస్సుల్లో ఎల్బీ స్టేడియానికి వెళ్లనున్నారు. ప్రమాణ స్వీకారం చేయబోయే మంత్రుల పేర్లను ఇప్పటికే హైకమాండ్ రాజ్ భవన్ కు పంపించింది.
ప్రస్తుతం తాజ్ కృష్ణ హోటల్ లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఉన్నారు. వాళ్లు తాజ్ కృష్ణ నుంచి నేరుగా ఎల్బీ స్టేడియానికి ప్రమాణ స్వీకారానికి రానున్నారు. మధ్యాహ్నం 1.04 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు మొత్తం 12 మంది ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక.. మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ కు చోటు దక్కింది.
వరంగల్ జిల్లా నుంచి సీతక్కకు అవకాశం కల్పించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురికి అవకాశం లభించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, భట్టి విక్రమార్కకు అవకాశం లభించింది. ఇక.. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి అవకాశం దక్కింది. కరీంనగర్ జిల్లా నుంచి పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు.. మహబూబ్ నగర్ జిల్లా నుంచి జూపల్లి కృష్ణారావు, ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి దామోదర రాజనర్సింహకు అవకాశం దక్కింది.