Telangana Dalit Bandhu : తెలంగాణ దళిత బంధు ద్వారా ప్రతీ దళిత కుటుంబానికి 10 లక్షల సాయం.. ఎలా ఎంపిక చేస్తారంటే?
Telangana Dalit Bandhu : తెలంగాణ దళిత బంధు.. కేవలం తెలంగాణ దళితుల కోసం రూపొందిన సరికొత్త పథకం ఇది. ఈ పథకాన్ని తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్.. ఈసందర్భంగా తెలంగాణ దళిత బంధు పథకాన్ని ప్రకటించారు. ఇప్పటికే తెలంగాణలో దళిత సాధికారత కోసం ఒక పథకాన్ని ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్ ఇదివరకు హామీ ఇచ్చిన నేపథ్యంలో.. ఈ పథకానికి తెలంగాణ దళిత బంధు అనే పేరు పెట్టారు.

telangana dalit bandhu from Huzurabad by cm kcr
ఇప్పటికే రైతు బంధు అనే పథకం.. రైతుల కోసం రూపొందించిన విషయం తెలిసిందే. రైతు బంధు పథకంలో భాగంగా సంవత్సరానికి ఒక ఎకరానికి పది వేల రూపాయల పెట్టుబడి సాయాన్ని తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందిస్తోంది. అలాగే.. తెలంగాణ దళిత బంధు పథకం ద్వారా కూడా తెలంగాణలోని దళితులను ఎంపిక చేసి వాళ్లకు ప్రభుత్వం సాయం అందిస్తుంది.
అయితే.. ఈ పథకాన్ని పైలెట్ ప్రాజెక్ట్ కింద.. కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ లో ప్రారంభించనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. పైలెట్ ప్రాజెక్టు కింద హుజూరాబాద్ నియోజకవర్గంలో 1200 కోట్లతో ప్రారంభించనున్నారు. ఇది పైలెట్ ప్రాజెక్టు కాబట్టి.. హుజూరాబాద్ నియోజకవర్గానికి సుమారుగా 1500 కోట్ల నుంచి 2000 కోట్ల వరకు ప్రభుత్వం వెచ్చించనుంది.
Telangana Dalit Bandhu : లబ్ధిదారులను ఎలా ఎంపిక చేస్తారు?
ప్రస్తుతం హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో మొత్తం 20929 దళిత కుటుంబాలు ఉన్నాయి. ఇందులో అసలైన లబ్ధిదారులను ప్రభుత్వం ఎంపిక చేస్తుంది. పేద కుటుంబాలను, కుటుంబంలో ఉద్యోగం చేసే వాళ్లు లేకుంటే.. కూలి పని చేసుకొని బతికే వాళ్లను,.. ఇలా.. పలు నిబంధనల ప్రకారం.. అర్హులైన వారిని ప్రభుత్వం ఎంపిక చేసి.. ఆయా కుటుంబాలకు ప్రతీ కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున అందిస్తారు.
Telangana Dalit Bandhu : రైతు బంధు లాగానే.. దళిత బంధు సాయం డైరెక్ట్ గా ఖాతాల్లో జమ
ముందు హుజూరాబాద్ లో ప్రారంభించాక.. తెలంగాణ దళిత బంధు పథకాన్ని మొత్తం తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో ప్రారంభించనున్నారు. రైతు బంధు సాయాన్ని డైరెక్ట్ గా రైతుల ఖాతాల్లో జమ చేసినట్టుగానే.. దళిత బంధు సాయాన్ని కూడా డైరెక్ట్ గా ఎంపికైన దళితుల ఖాతాల్లోనే జమ చేయనుంది ప్రభుత్వం. ఈ పథకాన్ని జులై చివరి వారంలో కానీ.. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజున కానీ.. సీఎం కేసీఆర్ హుజూరాబాద్ లో ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది.