Breaking : హెచ్చరిక .. వచ్చే నాలుగు వారాలు జాగ్రత్త డీ హెచ్
Breaking : రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయనీ.. తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైెరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ కూడా చాలా వేగంగా వ్యాప్తి చెందుతోందంటూ.. ప్రస్తుత పరిస్థితులు థర్డ్ వేవ్ కు సంకేతమన్నారు. రాబోయే రోజుల్లో కేసులు మరింత పెరుగుతాయన్న శ్రీనివాస్.. వచ్చే 4 వారాలు అత్యంత కీలకమని హెచ్చరించారు.
ఫిబ్రవరిలో మళ్ళీ కేసులు సంఖ్య తగ్గుతూ వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్నారు. అయితే ఒమిక్రాన్ పట్ల భయపడాల్సిన అవసరం లేదన్న శ్రీనివాస్.. దీని లక్షణాలు స్వల్పమేనని గుర్తు చేశారు. ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా మహమ్మారి నుంచి రక్షించుకోవచ్చని అన్నారు. ఇంటా బయటా మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం వంటి కోవిడ్ నియమాలను పాటించాలని కోరారు.
ఏ చిన్న లక్షణాలు కనిపించినా వైద్యులను సంప్రదించాలని సూచించారు. 2 కోట్ల కోవిడ్ పరీక్షలు, 2 లక్షలకు పైగా హోమ్ ఐసోలేషన్ కిట్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో కోవిడ్ చికిత్స నిర్వహణ విషయంలో ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు.