Etela Rajender : కేసీఆర్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన ఈటల రాజేందర్?
Etela Rajender.. తెలంగాణ మలిదశ ఉద్యమం ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నారు. అప్పటి నుంచి సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారు. కానీ.. ఏనాడూ కేసీఆర్ ను పల్లెత్తు మాట అనలేదు ఈటల. కేసీఆర్ కూడా ఈటలకు పెద్ద పెద్ద పదవులు ఇచ్చారు. రెండు సార్లు మంత్రిని చేశారు. ఈటలకు ఇచ్చిన ప్రాధాన్యత ఇంకెవ్వరికీ ఇవ్వలేదు.
కానీ.. ఈమధ్య టీఆర్ఎస్ పార్టీలో ఏదో జరుగుతోంది. పార్టీ నేతలంతా పార్టీ గురించి బయట చెడుగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్.. తానొక లిమిటెడ్ కంపెనీలో పనిచేస్తున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దానిపై టీఆర్ఎస్ పార్టీలోనే పెద్ద కుదుపు ఏర్పడింది. ఆ తర్వాత వెంటనే కరీంనగర్ జిల్లా పర్యటనకు వెళ్లిన మంత్రి ఈటల.. రైతు బంధు పథకం తప్పుదారి పడుతోందని.. రియల్ ఎస్టేట్ చేసే వాళ్లకు, గుట్టలకు, రాళ్లు రప్పలు ఉన్న భూములకు, ఇన్ కమ్ టాక్స్ కట్టేవాళ్లకు కూడా రైతు బంధు ఎందుకు ఇవ్వడం.. అంటూనే ఇది రైతుల అభిప్రాయం అంటూ దాటవేశారు.
కట్ చేస్తే.. మరోసారి సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి ఈటల. సీఎం కేసీఆర్ తో నాకు దాదాపు 20 ఏళ్ల అనుబంధం ఉంది. అందుకే నా మీద ఆయనకు అజమాయిషీ ఉంది. అలాగే ఆయనపై కూడా నాకు అజమాయిషీ ఉంది.. అంటూ ఈటల షాకింగ్ కామెంట్స్ చేశారు.
జమ్మికుంటలో క్లస్టర్ రైతు చైతన్య వేదికను రైతులకు అంకితం చేస్తూ ఈ వ్యాఖ్యలు
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వావిలాల క్లస్టర్ రైతు చైతన్య వేదికను రైతులకు అంకితం చేసిన అనంతరం మంత్రి ఈటల ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
సీఎం కేసీఆర్.. తనకు ఇష్టం లేని పని ఏది చెప్పినా అస్సలు వినరు. కానీ.. తనకు ఇష్టమైనదైతే ఎంతసేపు అయినా వింటారు. రైతుల కోసం ఎంతో కష్టపడుతున్న సీఎం కేసీఆర్ మాత్రమే. తెలంగాణలో రైతునే రాజును చేసే ప్రక్రియ కొనసాగుతోంది. రైతుల కోసం 24 గంటల కరెంటు, నీళ్లు, విత్తనాలు, ఎరువులు.. అన్నీ ఇస్తున్నారు కేసీఆర్.. అంటూ ఈటల స్పష్టం చేశారు.