TDP : జనసేన, టీడీపీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

TDP : జనసేన, టీడీపీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు

TDP : 2024 సంవత్సరం జరగబోతున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా ని ఓడించేందుకు తెలుగు దేశం పార్టీ మరియు జనసేన పార్టీలు పొట్టి పొత్తు పెట్టుకుని ముందుకు సాగాలని నిర్ణయించుకున్న విషయం ఇప్పటికే దాదాపుగా కన్ఫామ్ అయ్యింది. వారు అధికారికంగా ప్రకటించకున్నా… చంద్రబాబు నాయుడు ను మళ్లీ సీఎంగా చూడాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ వైకాపా నాయకులు ఎద్దేవా చేస్తున్నారు.ఏ రాజకీయ నాయకుడైనా పార్టీ పెట్టి తమ పార్టీ అధికారంలోకి […]

 Authored By prabhas | The Telugu News | Updated on :26 April 2022,6:00 pm

TDP : 2024 సంవత్సరం జరగబోతున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా ని ఓడించేందుకు తెలుగు దేశం పార్టీ మరియు జనసేన పార్టీలు పొట్టి పొత్తు పెట్టుకుని ముందుకు సాగాలని నిర్ణయించుకున్న విషయం ఇప్పటికే దాదాపుగా కన్ఫామ్ అయ్యింది. వారు అధికారికంగా ప్రకటించకున్నా… చంద్రబాబు నాయుడు ను మళ్లీ సీఎంగా చూడాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ వైకాపా నాయకులు ఎద్దేవా చేస్తున్నారు.ఏ రాజకీయ నాయకుడైనా పార్టీ పెట్టి తమ పార్టీ అధికారంలోకి రావాలని, తాను స్వయంగా సీఎం అయ్యి ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించాలని కోరుకుంటారు.

కాని జనసేన పార్టీ పెట్టి పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు నాయుడు ని సీఎంగా చేయాలని.. ఆయన యొక్క అభివృద్ధి కోసం పాటు పడుతున్న అంటూ వైకాపా కార్యకర్తలు ఎద్దేవా చేస్తున్నారు. ప్రజలు ప్రతి విషయాన్ని చూస్తున్నారని, తెలుగు దేశం పార్టీ మరియు జనసేన పార్టీలు కేవలం రాజకీయ లబ్ధి కోసం అధికారం కోసం కలుస్తున్నారు అంటూ అందరు గమనిస్తున్నారు. కనుక అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగే ఉద్దేశంతో సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపిస్తారు అంటూ వైకాపా నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.తెలుగుదేశం మరియు జనసేన పార్టీలు గతంలోనే కలిసి మధ్యలో విడిపోయాయి.

Telugu Desam Party and Janasena parties alliance ysrcp leaders response

Telugu Desam Party and Janasena parties alliance ysrcp leaders response

ఆ రెండు పార్టీల కలయిక మరియు విడిపోవడం రెండు కూడా విడ్డూరమే అంటూ రాజకీయ విశ్లేషకులు ఇప్పటికే అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు. వారు కలవడం వెనుక ఉద్దేశం పై క్లారిటీ లేదు.. విడిపోవడం వెనక అభిప్రాయ భేదాలు కూడా క్లారిటీ లేదు. కనుక ఆ రెండు పార్టీలు ఎప్పుడూ కలిసి ఉంటాయి, ఎప్పుడు విడిపోతారో తెలియదు. అలాంటి రెండు పార్టీలు అధికారంలోకి వస్తే కచ్చితంగా ప్రభుత్వం సంక్షోభంలో పడే అవకాశం ఉంటుంది. అందుకే బలమైన వైకాపా పార్టీని గెలిపించుకొని ప్రభుత్వ బాధ్యత ఇస్తే బాగుంటుంది అనేది ప్రజల అభిప్రాయంతో ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది