Nara Lokesh : నారా లోకేష్‌ పాద యాత్ర చేస్తే ఎవరు పట్టించుకోరు చంద్రబాబు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nara Lokesh : నారా లోకేష్‌ పాద యాత్ర చేస్తే ఎవరు పట్టించుకోరు చంద్రబాబు..!

 Authored By prabhas | The Telugu News | Updated on :31 May 2022,7:00 am

Nara Lokesh : తెలుగు దేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావాలి అంటూ ఏం చేయాలి అంటూ పార్టీ అధినాయకత్వం ఇటీవల జరిగిన మహానాడు కార్యక్రమంలో అడగడం జరిగిందట. ఆఫ్‌ ది రికార్డ్‌ జరిగిన ఈ సర్వే లో చాలా మంది చాలా రకాల సమాధానాలు ఇవ్వడం జరిగిందట. చాలా మంది తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా పాద యాత్ర చేయాల్సిందే అన్నారట. అయితే తెలుగు దేశం పార్టీ చాలా నష్టపోయింది లోకేష్ వల్ల కనుక ఆయన పాద యాత్ర చేయడం కరెక్ట్‌ కాదని మొహానే అనేశారట.

నారా లోకేష్‌ ఇంకా రాజకీయంగా ఎదగాలి అంటూ కొందరు సలహా ఇచ్చారట. నారా లోకేష్ ఒక వేళ పాద యాత్ర చేస్తే ఏ ఒక్కరు పట్టించుకునే పరిస్థితి ఉండదు. కనుక ఆయన ఖచ్చితంగా పాద యాత్ర అని కాకుండా మరో రకంగా ప్రయత్నించాలి. వచ్చే ఎన్నికల్లో ఆయన్ను గెలిపించుకోవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలుగు దేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు అంతా కూడా నారా లోకేష్ పై నమ్మకం పెట్టుకున్నారు అంటూ మీడియాలో వస్తున్న వార్తలపై కూడా మహానాడు వేదికగా చర్చ జరిగిందట.

telugu desam party workers angry on Nara Lokesh

telugu desam party workers angry on Nara Lokesh

వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ తరపున నిలిచేది.. కార్యకర్తలను నడిపించేది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అని జనాలకు తెలిసేలా ప్రచారం చేయాలి. ఒక వేళ లోకేష్ ముఖ్యమంత్రి ని చేస్తాం అంటూ ప్రచారం చేస్తే మాత్రం మొన్న వచ్చిన సీట్లు కూడా గల్లంతు అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కామెడీగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి చాలా మంది చాలా రకాలుగా లోకేష్ పాద యాత్ర చేస్తే బాగోదు అంటూ కామెంట్స్ చేయడం జరిగింది. ఆ విషయంలో లోకేష్‌ నుండి ఎలాంటి స్పందన లేదు కాని బాబు మాత్రం ఇప్పట్లో లోకేష్ కు పార్టీ పగ్గాలు ఇచ్చే అవకాశం లేదని స్పష్టం చేశాడు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది