Trump | ట్రంప్ ఆరోగ్యానికి ఏమైంది… ఇవి చూసి అందరిలో టెన్షన్
Trump |అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ట్రంప్‌నకు 79ఏళ్లు. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన కొద్దికాలంకు ట్రంప్ అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుస్తుంది. తాజాగా ట్రంప్ చేతిపై పెద్ద మచ్చ ఉండటం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల అలాస్కాలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ అయ్యారు. ఆ భేటీ సందర్భంగా పుతిన్‌ను ఆహ్వానించే సమయంలో ట్రంప్ కార్పెట్ పై నేరుగా కాకుండా కాస్త తూలుతున్నట్లుగా అటూఇటూ నడిచారని రాసుకొచ్చారు.

#image_title
ఏమైంది..
ట్రంప్‌ను కొంతకాలంగా దగ్గర నుంచి చూస్తున్న వారు ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఆయన కాలి చీలమండల వద్ద వాపు, కుడిచేతి వెనకాల కమిలి పోయినట్లుగా వంకాయ రంగులో పెద్ద మచ్చ, ఉబ్బిపోయిన కళ్లు, రంగుమారిపోయిన పెదవులు, నడిచేటప్పుడు బ్యాలెన్స్ కోల్పోతుండటం వంటి వాటిని చూపిస్తూ ఆయన ఆరోగ్యంపై కామెంట్స్ చేస్తున్నారు.
ట్రంప్ కుడిచేతిపై పెద్దటి మచ్చ గురించి చర్చజరుగుతున్న వేళ.. వైట్‌హౌస్ వైద్యుడు సియాన్ బార్బబెల్లా వివరణ ఇచ్చారు. రక్తాన్ని పలుచన చేసే ఆస్ప్రిన్ ను ట్రంప్ వాడుతున్నాడని, ఇటీవల చాలా మందిని కలిసి కరచాలనం చేయడంతో చర్మం రాపిడికి గురై మచ్చ ఏర్పడిందని చెప్పారు. ప్రస్తుతం ట్రంప్ వయస్సు 79ఏళ్లు. ఈ వయస్సులో ఇలాంటి సమస్యలు సర్వసాధారణమేనని.. అయితే, తీవ్రమైన గుండె, రక్తనాళాల వ్యాధులేమీ లేవని సియాన్ పేర్కొన్నారు.