
that person gettinig crores of money with a buffalo
ఒక మామూలు సగటు జీవి నెలకు గట్టిగా కష్టపడితే 25 వేల రూపాయల వరకు సంపాదిస్తాడు. అదే సాఫ్ట్ వేర్ టెకీలయితే మరింత ఎక్కువగా సంపాదిస్తారు. కానీ ఓ వ్యక్తి ఎటువంటి పని చేయకుండా ఏడాదికి రెండు కోట్ల రూపాయలను కూర్చుండే సంపాదిస్తున్నాడు. ఇలా అంత డబ్బు సంపాదిస్తున్నాడంటే అతడికి ఏదైనా బిజినెస్సో, లేక ఏజెన్సీ యో ఉందని అనుకుంటే పొరపాటే. అతడికి అటువంటివి ఏమీ లేవు. అతడికి ఉన్నది కేవలం దున్నపోతు మాత్రమే.
అవును. మీరు విన్నది కరెక్టే. అతడు దున్నపోతు మీద ఏడాదికి రెండు కోట్ల రూపాయలను సంపాదిస్తున్నాడు. అతడు అంతలా డబ్బులు సంపాదిస్తున్నాడంటే ఆ దున్నపోతును ఏదో పందెంలో ఉంచాడనుకుంటే పొరపాటే. అతడు ఆ దున్నపోతు వీర్యం మీదే అంత డబ్బులు సంపాదిస్తున్నాడు. అర్వింద్ జంగిడ్ అనే వ్యక్తికి చెందిన భీమ్ అనే దున్నపోతు కథ ఇది. ఈ దున్నపోతు ధర తెలిస్తే మీరు షాక్ కు గురికాక మానరు. ఈ దున్నపోతు ధర ఏకంగా 24 కోట్ల రూపాయలు. ఈ దున్నపోతు నెలవారీ ఖర్చుల విషయాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.
that person gettinig crores of money with a buffalo
ఈ దున్నపోతును పోషించేందుకు నెలకు రెండు లక్షల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు అర్వింద్ పేర్కొన్నాడు. ఇంత ఖర్చు ఎందుకోసమంటే ఆ దున్నపోతు రోజుకు ఏకంగా 25 లీ. పాలు, అరకేజీ వెన్న, కేజీ నెయ్యి, 200 గ్రా. తేనే, కిలో జీడిపప్పు తన ఆహారంగా తీసుకుంటుంది. అందుకోసమే ఈ దున్నపోతు నెల వారీ ఖర్చులు రెండు లక్షల రూపాయలను తాకాయి. ఈ దున్నపోతు వీర్యం ద్వారా పుట్టిన గేదెలు పెద్దయ్యాక 25 నుంచి 30 లీ. వరకు పాలిస్తాయట. ఈ విషయాన్ని ఆ దున్నపోతు యజమాని అయిన అర్వింద్ జంగిడే స్వయంగా తెలిపాడు. ఏడాదికి రెండు కోట్లు సంపాదిస్తుందంటే, ఆ దున్నపోతు చాలా గ్రేట్ కదా.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.