BRS : తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన టిఆర్ఎస్ కు ఇప్పుడు కొత్త భయాలు పట్టుకున్నాయి. లోక్ సభ ఎన్నికలలో ఆ పార్టీ పరిస్థితి అగమ్యత గోచక తయారైంది. పోటీ చేసేందుకు నేతలు వెనకాడుతున్నారని చర్చ మొదలైంది. ఎమ్మెల్యే టికెట్ రానివారు ఎంపీ టికెట్ ఆశిస్తున్నారూ అనుకుంటే వాళ్లు కూడా వద్దంటున్నారు అని సమాచారం. సిట్టింగులు కూడా పెద్దగా ఆసక్తి చూపడం లేదంటా. ఇది వరకు గులాబీ పార్టీ కి డిమాండ్ ఎక్కువగా ఉండేది. ఎన్నికలలో ఆ పార్టీ అభ్యర్థిగా అవకాశం కల్పించుకునేందుకు నాయకులు పోటీ పడేవారు. కాని ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ఓటమితో ఇప్పుడు సీన్ రివర్స్ అయింది అని చెప్పాలి. త్వరలో రాబోతున్న పార్లమెంట్ ఎన్నికలలో లోక్ సభ స్థానాలకు కారు గుర్తుపై పోటీ చేసేందుకు నేతలు ఇంట్రెస్ట్ చూపడం లేదు. కొన్ని నియోజకవర్గాలలో అది స్పష్టంగా తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయి ప్రభుత్వాన్ని కోల్పోవడంతో మళ్లీ ఇప్పుడు లోక్ సభ ఎన్నికలు అంటే గెలుపు కష్టమని భావన గులాబి నేతలలో ఏర్పడింది. దేశ ప్రధాని నిర్ణయించే ఎన్నికలు కావడంతో కాంగ్రెస్ బిజెపి పార్టీల మధ్యనే ప్రధానంగా ఉండే అవకాశం ఉంటుందని బిఆర్ఎస్ నాయకులు అంచనా వేస్తున్నారు. అలాంటప్పుడు ఎన్నికలలో పోటీ చేసి డబ్బు ఖర్చు పెట్టే పరిస్థితి ఉంటుందా అని అనుమానం వారిని వెంటాడుతున్నాయి. మెజార్టీ నియోజకవర్గాలలో పోటీకి భయపడుతున్నారు.
ఒకటి రెండు చోట్లకు మాత్రమే అంత డిమాండ్ ఉంది. నేతలను ఉత్తేజపరిచేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. నేతలను పోరాట మార్గంలో నడిపించాలనుకుంటున్నారు. ఎన్నికలలో ఖర్చుపెట్టిన గెలుస్తామో లేదో అని ఆందోళన నేతలలో కనిపిస్తుంది. క్యాడర్ లో నేతల లో అసంతృప్తి తగ్గలేదు. ఇక ఇప్పుడు టికెట్ తెచ్చుకొని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటే గెలుస్తామో లేదా అని నేతలు భయపడుతున్నారు. అయితే పార్టీ పెద్దలు చెబుతున్న దాని ప్రకారమే 5 నుండి 6 పార్లమెంట్ నియోజకవర్గాలలో మాత్రమే అసెంబ్లీ లో బిఆర్ఎస్ కు అనుకున్న ఫలితాలు వచ్చాయి. అంటే పది స్థానాల్లో పార్టీకి ప్రతికూల స్పందన ఉంది. ఖమ్మం , నల్గొండ ,భువనగిరి , పెద్ద పల్లి ,ఆదిలాబాద్ , నాగర్ కర్నూల్ , మహబూబ్నగర్ , వరంగల్ , మహబూబాద్ , లోక్ సభ స్థానాల్లో అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సుమారు రెండు నుంచి మూడు లక్షల పైగా ఓట్ల మెజార్టీ సాధించింది. సికింద్రాబాద్ , మల్కాజ్గిరి , కరీంనగర్ మెదక్ , జహీరాబాద్ వంటి చోట్ల బిఆర్ఎస్ పార్టీకి అనుకూల ఫలితాలు వచ్చాయి. అక్కడ కూడా లోక్ సభ ఎన్నికలలో గెలిచే అవకాశం పై అనుమానాలు కొనసాగుతున్నాయి. దాంతో పోటీకి బిఆర్ఎస్ నేతలు విముక్తత వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు వేస్ట్ చేసుకోవడమే అన్న భయం వారిలో కనిపిస్తుంది.
దాంతో సిట్టింగులను ఉద్దేశపరిచే కార్యక్రమంలో శుక్రవారం కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. లోక్ సభ సమావేశాల్లో పార్టీ వైఖరిని నియమించేందుకు అని చెప్పుకొచ్చిన అసలు సంగతి పార్లమెంటు ఎన్నికలకు సమాయత్తం చేసే అందుకే అని చెప్పక తప్పదు. కేసీఆర్ స్వయంగా మాట్లాడితే నేతలు ధైర్యంగా ఉంటారని కెసిఆర్ అంచనా వేసుకుని వారిని పిలిపించారు. భవిష్యత్తులో ఇలా అనేక మీటింగ్ లు పెట్టి వారి ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తారని అనిపిస్తుంది. బిఆర్ఎస్ లోక్ సభ టికెట్ అంటే వద్దు అనే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది . ఒకప్పుడు టికెట్ వస్తే చాలు గెలుస్తామనుకునేవారు కాని ఇప్పుడు సీన్ మారిపోయింది. పైగా అధికారంలో ఉన్నప్పుడు కనీసం క్యార్డర్ ని గుర్తించలేదని బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గాల సమీక్ష సమావేశంలో కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పెద్దల ఏక లక్ష వైకల్యం మారాలని కుండబద్దలు కొడుతున్నారు. సమీక్షలు కనీసం తమకు టికెట్ ఇవ్వాలని కానీ లేదా ఫలానా నేతకు ఇవ్వాలని కానీ ఎవ్వరు కోరడం లేదంట. దీంతో పార్టీలో పోటీ చేసేందుకు నేతలలో ఆసక్తి తగ్గిందని పోటీ అంటేనే పార్టీ నేతలు వెనకంచ వేస్తున్నట్లుగా ప్రచారం సాగుతుంది. అయితే ఈ పరిస్థితి నుంచి బయట పడాలి అంటే కేసీఆర్ ఇంకా యాక్టివ్ గా రంగంలోకి దిగాలని చెబుతున్నారు విశ్లేషకులు. మరి కేసీఆర్ ఏం చేస్తారో వేచి చూడాలి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.