Rolls Royce : రోల్స్ రాయిస్ కార్ల‌తో రోడ్లు ఊడ్పించిన ఇండియ‌న్ రాజు… షో రూమ్ లో జ‌రిగిన అవ‌మానంతో ఇలా.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rolls Royce : రోల్స్ రాయిస్ కార్ల‌తో రోడ్లు ఊడ్పించిన ఇండియ‌న్ రాజు… షో రూమ్ లో జ‌రిగిన అవ‌మానంతో ఇలా..

 Authored By aruna | The Telugu News | Updated on :29 July 2022,9:20 pm

Rolls Royce : ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్.. ప్ర‌పంచంలోని అత్యంత ఇలాస‌వంత‌మైన.. ఖ‌రీదైన కార్ల‌లో త‌యారీ సంస్థల్లో ఒక‌టి. ప్ర‌స్తుతం ఈ సంస్థ ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్ మార్కెట్ లోకి కూడా అడుగుపెడుతోంది. చార్లెస్ స్టెవర్ట్ రోల్స్ మరియు ఫ్రెడరిక్ హెన్రీ రాయిస్ ఇద్దరూ 1906లో రోల్స్ రాయిస్ సంస్థను స్థాపించారు. అయితే ఈ కార్ల‌కి రాజుల కాలంలో కూడా మంచి డిమాండ్ ఉండేద‌ట మొదటి ప్రపంచ యుద్ధానికి (1914-1918) ముందు రోల్స్ రాయిస్ కంపెనీ 20 వేలకు పైగా కార్లను ఉత్పత్తి చేస్తే.. అందులో 20 శాతం ఇండియాకే దిగుమతి చేసేద‌ట‌.

ఆ కాలంలో ఇండియాలో దాదాపు 230 మందికి పైగా మహారాజులు ఉన్నార‌ట‌. దేశంలో సగటున 2000 రోల్స్ రాయిస్ కార్లు తిరిగేవ‌ట‌. ఆ రోజుల్లో ఇండియన్ కింగ్స్ కి రోల్స్ రాయిస్ కి మధ్య ప్రత్యేక అనుబంధం ఉండేది. రాజస్థాన్‌లోని అల్వార్ కు చెందిన ప్రముఖ మహారాజు జై సింగ్ ఒకేసారి మూడు ఆటో మొబైల్స్ కొనుగోలు చేసేవాడ‌ట‌. ఈ క్ర‌మంలోనే 1920లో ఆల్వార్ మహారాజా జై సింగ్ లండన్‌లోని మేఫెయిర్ ఏరియా వీధుల్లో తిరుగుతున్నాడ‌ట‌. అయితే సాధారణ వస్త్రధారణలో ఉండి రోల్స్ రాయిస్ షోరూమ్‌లోకి వెళ్ల‌గా ఓ బ్రిటీష్ సేల్స్‌మాన్ మహారాజా జై సింగ్‌ను చూసి చూడనట్టు వ్యవహరించాడ‌ట‌.

The Indian king who swept the roads with Rolls Royce cars

The Indian king who swept the roads with Rolls Royce cars..

దీంతో చిర్రెత్తుకొచ్చిన జై సింగ్ ఆ అవమానాన్ని భరించలేక వెంటనే తన హోటల్ గదికి తిరిగి వచ్చేశాడ‌ట‌. ఆ త‌ర్వాత‌ తన సేవకులతో రోల్స్ రాయిస్ షోరూమ్‌కి కాల్ చేయించి, అల్వార్ నగర రాజు వారి కార్లలో కొన్నింటిని కొనుగోలు చేయబోతున్నాడని చెప్పించాడు. ఆ తర్వాత రాజు దర్శనాన్ని పురస్కరించుకుని షోరూమ్‌లోని సేల్స్‌మెన్స్ అందరూ బారులు తీరి షోరూమ్‌లో రెడ్ కార్పెట్ పర‌చ‌గా అప్పుడు రాజు జై సింగ్ షోరూమ్‌ని సందర్శించాడు. ఆ సమయంలో షోరూమ్‌లో ఆరు కార్లు ఉన్నాయి. దీంతో రాజు ఒకేసారి ఆరు కార్లను కొనుగోలు చేశాడు. డెలివరీ ఛార్జీలతో సహా పూర్తి మొత్తాన్ని అక్క‌డే చెల్లించాడు.

Rolls Royce : ఇక్క‌డే ట్విస్ట్..

అయితే షోరూమ్ లో జ‌రిగిన అవ‌మానాన్ని ఆ రాజు భ‌రించ‌లేక‌ ఆరు రోల్స్ రాయిస్ భారతదేశానికి దిగుమతి చేసాక‌.. నగరంలోని వీధులను ఊడ్చేందుకు ఈ కార్లను ఉపయోగించాలని పారిశుధ్య వ్య‌వ‌స్థ‌ను ఆదేశించాడ‌ట‌. దీంతో ఈ విష‌యం ప్రపంచ వ్యాప్తంగా తెలిసిపోయింది. వరల్డ్ నంబర్ వన్ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ షాక్ గురైంద‌ట‌. ఈ కార్ల‌తో రోడ్లు ఊడ్పించ‌డంతో ఆ కంపనీ గుడ్ విల్.. ఆదాయం ఒక్కసారిగా పడిపోయింద‌ట‌. చివరకు.. రోల్స్ రాయిస్ ఆ రాజుకి క్షమాపణలు చెబుతూ టెలిగ్రామ్ పంపించింద‌ట‌. అంతేకాకుండా మరో ఆరు సరికొత్త కార్లను కూడా ఉచితంగా అంద‌జేసింద‌ట‌. దీంతె రాజు వారి క్ష‌మాప‌ణ‌లు మ‌న్నించి చెత్తను ఊడ్చ‌కుండా ఆదేశాలు జ‌రీ చేశాడ‌ట‌.. నెట్టింట్లో ఈ స్టోరీ వైర‌ల్ అవుతోంది. ఇండియ‌న్స్ తో పెట్టుకుంటే మామూలుగా ఉండ‌దు మ‌రి.. అంటూ నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.

Also read

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది