
The Indian king who swept the roads with Rolls Royce cars..
Rolls Royce : ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్.. ప్రపంచంలోని అత్యంత ఇలాసవంతమైన.. ఖరీదైన కార్లలో తయారీ సంస్థల్లో ఒకటి. ప్రస్తుతం ఈ సంస్థ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ లోకి కూడా అడుగుపెడుతోంది. చార్లెస్ స్టెవర్ట్ రోల్స్ మరియు ఫ్రెడరిక్ హెన్రీ రాయిస్ ఇద్దరూ 1906లో రోల్స్ రాయిస్ సంస్థను స్థాపించారు. అయితే ఈ కార్లకి రాజుల కాలంలో కూడా మంచి డిమాండ్ ఉండేదట మొదటి ప్రపంచ యుద్ధానికి (1914-1918) ముందు రోల్స్ రాయిస్ కంపెనీ 20 వేలకు పైగా కార్లను ఉత్పత్తి చేస్తే.. అందులో 20 శాతం ఇండియాకే దిగుమతి చేసేదట.
ఆ కాలంలో ఇండియాలో దాదాపు 230 మందికి పైగా మహారాజులు ఉన్నారట. దేశంలో సగటున 2000 రోల్స్ రాయిస్ కార్లు తిరిగేవట. ఆ రోజుల్లో ఇండియన్ కింగ్స్ కి రోల్స్ రాయిస్ కి మధ్య ప్రత్యేక అనుబంధం ఉండేది. రాజస్థాన్‌లోని అల్వార్ కు చెందిన ప్రముఖ మహారాజు జై సింగ్ ఒకేసారి మూడు ఆటో మొబైల్స్ కొనుగోలు చేసేవాడట. ఈ క్రమంలోనే 1920లో ఆల్వార్ మహారాజా జై సింగ్ లండన్‌లోని మేఫెయిర్ ఏరియా వీధుల్లో తిరుగుతున్నాడట. అయితే సాధారణ వస్త్రధారణలో ఉండి రోల్స్ రాయిస్ షోరూమ్‌లోకి వెళ్లగా ఓ బ్రిటీష్ సేల్స్‌మాన్ మహారాజా జై సింగ్‌ను చూసి చూడనట్టు వ్యవహరించాడట.
The Indian king who swept the roads with Rolls Royce cars..
దీంతో చిర్రెత్తుకొచ్చిన జై సింగ్ ఆ అవమానాన్ని భరించలేక వెంటనే తన హోటల్ గదికి తిరిగి వచ్చేశాడట. ఆ తర్వాత తన సేవకులతో రోల్స్ రాయిస్ షోరూమ్‌కి కాల్ చేయించి, అల్వార్ నగర రాజు వారి కార్లలో కొన్నింటిని కొనుగోలు చేయబోతున్నాడని చెప్పించాడు. ఆ తర్వాత రాజు దర్శనాన్ని పురస్కరించుకుని షోరూమ్‌లోని సేల్స్‌మెన్స్ అందరూ బారులు తీరి షోరూమ్‌లో రెడ్ కార్పెట్ పరచగా అప్పుడు రాజు జై సింగ్ షోరూమ్‌ని సందర్శించాడు. ఆ సమయంలో షోరూమ్‌లో ఆరు కార్లు ఉన్నాయి. దీంతో రాజు ఒకేసారి ఆరు కార్లను కొనుగోలు చేశాడు. డెలివరీ ఛార్జీలతో సహా పూర్తి మొత్తాన్ని అక్కడే చెల్లించాడు.
అయితే షోరూమ్ లో జరిగిన అవమానాన్ని ఆ రాజు భరించలేక ఆరు రోల్స్ రాయిస్ భారతదేశానికి దిగుమతి చేసాక.. నగరంలోని వీధులను ఊడ్చేందుకు ఈ కార్లను ఉపయోగించాలని పారిశుధ్య వ్యవస్థను ఆదేశించాడట. దీంతో ఈ విషయం ప్రపంచ వ్యాప్తంగా తెలిసిపోయింది. వరల్డ్ నంబర్ వన్ కార్ల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ షాక్ గురైందట. ఈ కార్లతో రోడ్లు ఊడ్పించడంతో ఆ కంపనీ గుడ్ విల్.. ఆదాయం ఒక్కసారిగా పడిపోయిందట. చివరకు.. రోల్స్ రాయిస్ ఆ రాజుకి క్షమాపణలు చెబుతూ టెలిగ్రామ్ పంపించిందట. అంతేకాకుండా మరో ఆరు సరికొత్త కార్లను కూడా ఉచితంగా అందజేసిందట. దీంతె రాజు వారి క్షమాపణలు మన్నించి చెత్తను ఊడ్చకుండా ఆదేశాలు జరీ చేశాడట.. నెట్టింట్లో ఈ స్టోరీ వైరల్ అవుతోంది. ఇండియన్స్ తో పెట్టుకుంటే మామూలుగా ఉండదు మరి.. అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.