Viral News : పిల్లి పిల్ల అనుకోని పెంచింది .. చివరికి అది పెద్దయ్యాక చూసి షాక్ ..!

Authored By aruna | The Telugu News | Published on: September 27, 2023, 11:00 am

Viral News : పెట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చిన్న పిల్లల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరు వాటితో సమయం గడపడానికి ఇష్టపడతారు. కుక్కలు, పిల్లులు, పక్షులు ఇలా కొన్ని రకాల జంతువులను ఇంట్లో పెంచుతూ ఉంటారు. ఇవి మనుషులతో అనుబంధాన్ని పెంచుకుంటాయి. మనం ప్రేమ చూపిస్తే అవి డబల్ ప్రేమను చూపిస్తాయి. అవి దూరమైతే చాలా బాధపడతారు. ఇలాగే ఓ మహిళ రోడ్డు పక్కన పడి ఉన్న ఓ పిల్లి పిల్ల ను ఇంటికి తీసుకుని వచ్చింది. కానీ అది చివరకు పెద్దయ్యాక చూసి షాక్ అయింది.

రష్యా కు చెందిన విక్టోరియా జంతు ప్రేమికురాలు. ఆమె ఒక కుక్కను ఇంట్లో పెంచుకుంటుంది. ఒకరోజు రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా దారిలో చెట్ల పొదలలో ఒక కూన కనిపించింది. దానిని చూసి జాలిపడిన ఆమె దానిని చేతుల్లోకి తీసుకొని చూసింది. అది అచ్చం పిల్లి పిల్లలా కనిపించింది. దీంతో వెంటనే ఇంటికి తీసుకెళ్ళి శుభ్రం చేసి తన కుక్కతో పాటు దానిని పెంచింది. కుక్కతో పాటు ఆ పిల్లి పిల్ల కూడా ఆరోగ్యంగా పెరగడం ప్రారంభించింది. విక్టోరియా కూడా రెండిటిని సమానంగా చూసుకుంది. అవి కూడా ఆడుతూ పాడుతూ తిరిగాయి.

The kitten grew unexpectedly has black Panther

The kitten grew unexpectedly has black Panther

ఇంతలో ఏడాది గడిచిపోయింది. పిల్లి పిల్ల అనుకున్న ఆ కూన పెద్దయ్యాక నల్ల చిరుత పులి అయింది. దీంతో విక్టోరియా ఒక్కసారిగా షాక్ అయింది. అయినా ఆమె భయపడలేదు. ఆ కుక్క , నల్ల చిరుత పులి మధ్య ఉన్న బంధాన్ని దూరం చేయడానికి ఆమె ఇష్టపడలేదు. వాటిని విడదీయొద్దని నిర్ణయించుకుంది. రెండు కలిసే పెరుగుతున్నాయి. తాజాగా అవి రెండూ మంచులో ఆడుతున్న వీడియోను విక్టోరియా సోషల్ మీడియాలో షేర్ చేసింది. నల్ల చిరుత పులి కూడా తను చిరుత అని మరిచిపోయి సాధు జంతువుల పెరిగింది. దానికి వేట, క్రూరంగా ప్రవర్తించడం తెలియకపోవడంతో దానితో ఎటువంటి ప్రమాదం ఉండదని పర్యావరణవేత్తలు అంటున్నారు. అయితే కొందరు మాత్రం దానిని అడవిలో వదిలేయడమే మంచిది అని అంటున్నారు.

aruna

No bio available for this author.

Tags :
Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp