Viral News : ఫోన్ అతిగా వాడిన యువకుడు.. చివరకు ఎలా అయ్యాడో చూడండి.. వీడియో
Viral news : ప్రస్తుత యుగంలో స్మార్ట్ ఫోన్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఎవర్ని చూసినా కానీ ఫోన్ ఆపరేట్ చేసుకుంటూ రోడ్డు మీద వెళ్తుంటారు. కొందరైతే ఏకంగా ఫోన్ చూస్తేనే వాహనాలు నడుపుతుంటారు. ఫోన్ వాడుతూ వాహనాలు నడపడం వలన ప్రమాదాలు సంభవిస్తాయని అలా చేయడం నేరమని ఎంత మంది చెప్పినా కానీ కొందరు మారడం లేదు. ఇలా ఫోన్ వాడుతూ వాహనాలను నడిపి చివరకు తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.వారు గాయాలపాలయి ఆస్పత్రి బెడ్ మీద ఉన్నపుడు కూడా ఫోన్ తెరనే చూస్తూ గడుపుతున్నారు.
అంటే వారు ఫోన్ కు ఏవిధంగా బానిసలయ్యారో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కానీ ఇలా అధికంగా ఫోన్ ను వాడడం వలన అనేక ప్రమాదాలు వస్తాయని ఓ పక్క నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినా కానీ కొంత మంది నిపుణుల మాటలను కూడా పెడచెవిన పెడుతున్నారు. ఎంత మంది చెప్పినా కానీ ఫోన్ ను విపరీతంగా వాడుతున్నారు.ఇలాగే రాజస్థాన్ కు చెందిన అక్రమ్ అనే యువకుడు గంటల కొద్దీ ఫోన్ వాడి చివరకు ఆస్పత్రి పాలయ్యాడు. అక్రమ్ రాత్రిళ్లు మొదలుకుంటే తెల్లవారే వరకు ఫోన్ లో గడిపేవాడట.
Viral news : గంటల కొద్దీ ఫోన్ వాడేసరికి..
ఇలా ఫోన్ వాడుతూ సరిగ్గా నిద్ర పోవడం అటుంచితే ఆహారం కూడా తీసుకునేవాడు కాదట. ఇప్పుడు అక్రమ్ తన కుటుంబ సభ్యులను కూడా గుర్తు పట్టలేని స్థితికి వచ్చాడు. ఫోన్ విపరీతంగా వాడడం వలన మానసిక స్థితి దెబ్బతిందని డాక్టర్లు చెబుతున్నారు. మీరు కూడా ఫోన్ ఎక్కువగా వాడితే వెంటనే తగ్గించండి. లేకపోతే మిమ్మల్ని కూడా మరో అక్రమ్ లా చూడాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. కావున ఫోన్ వాడడం తగ్గించండి. అదే మీకు మీ కుటుంబ సభ్యులకు చాలా మంచిది.