Mangoes : వామ్మో .. మామిడి పండు కిలో ధర రూ.2 లక్షలా..? అంత ప్రత్యేకత ఏంటి..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mangoes : వామ్మో .. మామిడి పండు కిలో ధర రూ.2 లక్షలా..? అంత ప్రత్యేకత ఏంటి..?

 Authored By ramu | The Telugu News | Updated on :14 May 2025,5:00 pm

Mangoes :  వేసవి అంటే మామిడి పండ్ల రుచులే గుర్తొస్తాయి. దేశవ్యాప్తంగా మామిడి సీజన్‌ ఊపందుకుంటే, పలు రకాల వెరైటీలు మార్కెట్‌లోకి వస్తుంటాయి. అలాంటి వేళ తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లాలోని కొండా లక్ష్మణ్ బాపూజీ ఫ్రూట్ రీసెర్చ్ స్టేషన్ ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇది దేశంలో మూడో అతిపెద్ద మామిడి పరిశోధన కేంద్రంగా గుర్తించబడింది. ఇక్కడ 477 రకాల మామిడి వెరైటీలు లభ్యమవుతుండగా, రైతులకు నాణ్యమైన మొక్కలు అందించడం ద్వారా గణనీయమైన సేవలు అందిస్తోంది.

ఈ పరిశోధన కేంద్రం మే 3, 4 తేదీలలో మ్యాంగో ఎగ్జిబిషన్ నిర్వహించింది. ఈ రెండు రోజుల ప్రదర్శనలో 240 రకాల మామిడి పండ్లను ప్రదర్శించారు. పల్ప్, జ్యూసీ రకాలు, పచ్చడి తయారీకి అనువైన రకాలు, ఎన్నో ప్రత్యేకతలు గల పండ్లను ఈ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన రైతులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు ఈ ప్రదర్శనలో పాల్గొనడం విశేషం.

Mangoes వామ్మో మామిడి పండు కిలో ధర రూ2 లక్షలా అంత ప్రత్యేకత ఏంటి

Mangoes : వామ్మో .. మామిడి పండు కిలో ధర రూ.2 లక్షలా..? అంత ప్రత్యేకత ఏంటి..?

ఈ ఎగ్జిబిషన్‌లో అద్భుతంగా ఆకట్టుకున్న మామిడి రకం జపాన్‌కు చెందిన “మియాజాకి” వెరైటీ. ఈ పండు పాలీహౌస్‌లో మాత్రమే పండుతుంది. వెలుపల పర్పుల్ షేడ్‌తో, లోపల ఆరెంజ్ రంగుతో కనిపించే ఈ పండు కళ్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది, ఎందుకంటే దీనిలో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. గతంలో జపాన్‌లో ఈ మామిడి వెరైటీకి కిలోకు రూ.2 లక్షల ధర పలకడం ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడీ ప్రత్యేక పండు మన తెలంగాణ మామిడి ప్రదర్శనలో కూడా చోటు దక్కించుకోవడం గర్వకారణంగా నిలిచింది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది