Funeral : ప్రస్తుత సమాజంలో మానవత్వం ఉన్న కొద్ది తగ్గిపోతుంది. కుటుంబంలో కూడా రక్తసంబంధాల మధ్య బంధాలు నానాటికి దిగజారిపోతున్నాయి. డబ్బు ఇంకా ఆస్తికోసం తోబుట్టువులను చంపే పరిస్థితి కనిపిస్తుంది. వృద్ధాప్యంలోకి వచ్చిన తల్లిదండ్రులను వదిలేస్తున్న పిల్లలు ఎక్కువైపోతున్నారు. సరిగ్గా ఈ తరహాల్లోనే మరీ చాలా దారుణమైన సంఘటన వైయస్సార్ కడప జిల్లాలో చోటుచేసుకుంది. దువ్వూరు మండలం సింగనపల్లేకు చెందిన చిన్న పుల్లారెడ్డి అనే 62 ఏళ్ల పెద్దాయన… తన కుమారుడు రాజశేఖర్ రెడ్డితో కలిసి జీవించేవాడు. ఈ రాజశేఖర్ రెడ్డి ఓ ప్రైవేట్ పాఠశాలలో బస్సు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో చిన్న పుల్లారెడ్డికి టీబీ ఎటాక్ అయ్యింది.
దీంతో కొడుకు రాజశేఖర్ రెడ్డి గ్రామంలో ఇచ్చిన చికిత్స సరిగ్గా పని చేయకపోవడంతో కడప ప్రభుత్వ ఆసుపత్రిలో తండ్రిని జాయిన్ చేయడం జరిగింది. ఒక రెండు మూడు రోజులపాటు ఆసుపత్రికి వచ్చి తండ్రిని చూసిన రాజశేఖర్ రెడ్డి.. ఆ తర్వాత హాస్పిటల్ కి వెళ్ళటమే మానుకున్నాడు. హాస్పిటల్ సిబ్బంది ఫోన్ చేసిన.. లిఫ్ట్ చేసేవాడు కాదు. చిన్న పుల్లారెడ్డి పరిస్థితి మరి విషమించటంతో చివరి నిమిషంలో కొడుకుని చూడాలని కోరాటంతో ఆసుపత్రి సిబ్బంది… గ్రామంకి వెళ్లి రాజశేఖర్ రెడ్డిని.. హాస్పిటల్ కి వచ్చేలా చేశారు. చివరి నిమిషంలో కొడుకుని చూసి కొన్ని నిమిషాలకు పుల్లారెడ్డి మరణించడం జరిగింది. దీంతో తండ్రి శవాన్ని ఒక ఆటోలో ఎక్కించుకొని తీసుకెళ్లిన రాజశేఖర్ రెడ్డి.. మార్గమధ్యలోనే… వేరే వాహనం వస్తుందని ఆటో డ్రైవర్ కి చెప్పి మృతదేహాన్ని దింపేయడం జరిగింది. ఆ తర్వాత ఆటో డ్రైవర్ వెళ్లిపోయిన వెంటనే…
తండ్రి మృతదేహాన్ని ఎవరు లేని… సమయంలో తుప్పల్లో విసిరి వేయడం జరిగింది. కొన్ని రోజులకు దుర్వాసన రావడంతో ప్రజలు శవాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. శవం పై హాస్పిటల్ లోగో గుర్తించడంతో విషయం మొత్తం మీడియాలో వైరల్ కావటంతో.. వెంటనే రాజశేఖర్ రెడ్డి పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోయాడు. డబ్బులు లేక ఈ రకంగా తండ్రి శవాన్ని తుప్పలలోకి విసిరేసినట్లు..తప్పు ఒప్పుకున్నాడు. చికిత్స అందించడానికి ఇంకా అంత్యక్రియలకు కూడా పేదరికం అడ్డు రావడం వల్ల ఈ రకంగా వ్యవహరించాల్సి వచ్చిందని.. తండ్రి మృతదేహాన్ని తుప్పలలోకి గెంటేసినట్లు పోలీసుల వద్ద రాజశేఖర్ రెడ్డి తన బాధ చెప్పుకున్నాడు. అయితే సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద తల్లిదండ్రులను చూసుకోకపోయినా ఈ రకంగా వ్యవహరించిన వదిలేది లేదని రాజశేఖర్ రెడ్డి పై చట్టపరంగా పోలీసులు చర్యలు తీసుకోవడం జరిగింది.
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
This website uses cookies.