Srikakulam : ప్రస్తుత రోజుల్లో భార్యాభర్తల బంధం కల్తీ అయిపోయిన సంగతి తెలిసిందే. ఒకపక్క ఇంట్లో కుటుంబం ఉన్న మరోపక్క బయట సైడ్ యవ్వారాలు… అక్రమ సంబంధాలు నడిపించే భర్తలు, భార్యలు… సమాజంలో ఎక్కువైపోతున్నారు. దీంతో పిల్లల జీవితాలు ప్రమాదంలో నెట్టేస్తున్నారు. ఈ పరిణామాలతో ఆ పిల్లలను సమాజం చాలా చిన్న చూపు చూడటంతో… అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటువంటి సమాజంలో భార్య చనిపోయిన మూడు రోజులకే ఓ భర్త… భార్య మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హృదయ విదారక ఘటన శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలో జరిగింది.
పూర్తి వివరాల్లోకి వెళితే శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం ఈసర్ల పేట గ్రామానికి చెందిన… 27 ఏళ్ల మంగరాజు రాజబాబు 2016లో ఆర్మీ ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. గత ఏడాది ఫిబ్రవరిలో అతడికి అదే గ్రామానికి చెందిన మౌనికతో పెళ్లి జరిగింది. కాగా రాజాబాబు ప్రజెంట్ హర్యానాలో విధులు నిర్వర్తిస్తున్నాడు. మౌనిక ఏడు నెలల గర్భవతి. ఆమెకు ఇటీవల హెల్త్ ఇష్యూస్ రావడంతో రాజాబాబు తండ్రి సత్యనారాయణ…. విశాఖపట్నంలో ఆర్మీ ఆసుపత్రిలో జాయిన్ చేశాడు. విషయం తెలిసిన వెంటనే సెలవు పై రాజాబాబు ఇంటికి చేరుకున్నాడు.
భార్యను బతికించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. అయితే గుండెకు సంబంధించిన వ్యాధి కావటంతో పరిస్థితి విషమించటంతో ఈ నెల 16వ తారీఖున మౌనిక మృతి చెందింది. ఇంత భార్య మరణంతో తీవ్ర మనోవేదనకు గురైన రాజాబాబు.. సరిగ్గా భోజనం కూడా చేయకుండా అనారోగ్యానికి గురయ్యాడు. ఈనెల 19వ తారీకు ఆసుపత్రిలో హెల్త్ చెకప్ చేయించుకుని వస్తానని .. చెప్పి తోటలోకి వెళ్లి చెట్టుకి ఉరేసుకొని చనిపోయాడు. అనంతరం ఫ్రెండ్స్ కి మెసేజ్లు పెట్టి ఇన్సూరెన్స్ ఇంకా అనేక విషయాలు కుటుంబానికి రావలసిన వాటి గురించి తెలియజేయడం జరిగింది. దీంతో తల్లిదండ్రులు కొడుకు మరణ వార్త తెలుసుకుని విలవిలలాడిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) హైదరాబాద్లో ఒక సంవత్సరం అప్రెంటీస్షిప్ శిక్షణ కోసం గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటీస్…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే నవగ్రహాలలో అతి ముఖ్యమైన గ్రహం బృహస్పతి. సంపదకు విజ్ఞానానికి విద్య…
Success Story : ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరు కాస్త సృజనాత్మకతతో ఆలోచిస్తున్నారు. నాలుగు రూపాయలు సంపాదించాలనే ఆలోచన ప్రతి…
China Discovers : హునాన్ ప్రావిన్స్లో చైనా భారీ బంగారు నిల్వలను కనుగొంది. ఈ నిల్వల యొక్క అంచనా విలువ…
TTD : టీటీడీలో ఉద్యోగాల కోసం కొంత మంది కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తూ ఉంటారు. అయితే…
Elon Musk : టెస్లా అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ భారతదేశం ఓట్ల-లెక్కింపు ప్రక్రియ యొక్క సామర్థ్యాన్ని ప్రశంసించారు. ఆదివారం…
Prashanth Varma : అ! సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టిన ప్రశాంత్ వర్మ ఒక్కో సినిమాకు తన…
Heels Cracked : చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సమస్యలు అనేవి వెంటాడుతాయి. అలాగే చర్మం పగిలిపోవడం మరియు పొడిబారడం,చర్మం నిర్జీవంగా…
This website uses cookies.