Teenmar Mallanna : తీన్మార్ మల్లన్న యూటర్న్? కేసీఆర్ ను ఎదుర్కోలేక సంచలన నిర్ణయం? షాక్ లో మల్లన్న అభిమానులు?
Teenmar Mallanna క్యూ’ న్యూస్ నిర్వాహకుడు, జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ బీజేపీలో చేరనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సిద్దాంతాలకు ఆకర్షితుడై మల్లన్న బీజేపీలో చేరుతున్నట్లు క్యూ న్యూస్‌లో వార్తలు ప్రసారం చేస్తున్నారు. ప్రస్తుతం జైల్లో ఉన్న మల్లన్నను విడుదల చేయించేందుకు బీజేపీ పెద్దలు రంగంలోకి దిగారని చెబుతున్నారు. మల్లన్న ట్విట్టర్ ఖాతాలోనూ ‘జై బీజేపీ’ అని ట్వీట్ చేయడం గమనార్హం. జైలు నుంచి విడుదలయ్యాక మల్లన్న బీజేపీలో చేరే అవకాశం ఉంది. అయితే తీన్మార్ మల్లన్న బీజేపీ మనిషి అనే విమర్శలు మొదటి నుంచి ఉన్నాయి. అన్ని పార్టీల నేతలను, విధానాలను చీల్చి చెండాడే మల్లన్న బీజేపీ విధానాలపై గానీ, నేతలపై గానీ పెద్దగా విమర్శలు చేసిన దాఖలాలు లేవు. కేసులు ఎదుర్కొన్న ప్రతిసారి బీజేపీ నేతలే ఎక్కువ అండగా నిలబడుతున్నారు. మల్లన్న తరుపునప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్నారు.
ఒకే సామాజిక వర్గం.. Teenmar Mallanna
ఇక మల్లన్న సామాజికవర్గం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్‌లు మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందినవారన్న విషయం తెలిసిందే. దీంతో వీరి బంధం మరింత బలపడినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఆ సామాజికవర్గం ప్రస్తుతం బీజేపీ వెనుక ఎక్కువగా ర్యాలీ అవుతున్నారు. గత నెలలో హైదరాబాద్ క్యూ న్యూస్ కార్యాలయంలో పోలీసుల సోదాల సందర్భంగా బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చిన సంగతి తెలిసిందే.
బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ సైతం అక్కడికి వచ్చి మల్లన్నకు మద్దతుగా నిలిచారు. మల్లన్న వెనుక బీజేపీ ఉందనే ప్రచారానికి ఈ పరిణామంతో బలం చేకూరినట్లయింది. కేసీఆర్ సర్కార్‌ను ఒంటరిగా ఎదుర్కోవడానికి తన శక్తి సరిపోదని గ్రహించిన మల్లన్న అందుకే బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. మల్లన్న మొదటి నుంచి తనది బహజన వాదం అని ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పటికీ మల్లన్న ట్విట్టర్ ప్రొఫైల్‌లో ‘బాబా సాహెబ్ అంబేడ్కర్ బాటలో…’ అని రాసి ఉండటం గమనార్హం. అయితే ఇన్నాళ్లు బహుజనుల పేరు చెప్పిన మల్లన్న… ఇప్పుడు బీజేపీ గూటిలో చేరేందుకు సిద్ధపడటం చర్చనీయాంశంగా మారింది.