Solar Eclipse | సెప్టెంబర్ 21 సూర్యగ్రహణం… గర్భిణీలు తప్పక పాటించాల్సిన జాగ్రత్తలు
Solar Eclipse | ఈ సంవత్సరంలో చివరి సూర్యగ్రహణం సెప్టెంబర్ 21న ఏర్పడనుంది. అయితే ఇది భారతదేశంలో కనిపించకపోయిన గర్భిణీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు సూచిస్తారు. ఎందుకంటే తల్లి ఆరోగ్యంపై లేదా శిశువుపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని విశ్వసిస్తారు. ఈ సందర్భంలో గర్భిణీలు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఇవి:

#image_title
1. ఆహారం, వంట పనులు మానుకోండి
గ్రహణం సమయంలో మధ్యాహ్నం భోజనం చేయడం, వంటింటి పనులు చేయడం పూర్తిగా నివారించాలి. ముఖ్యంగా సూదులు, కత్తులు వంటి పదునైన వస్తువులను ఉపయోగించకూడదని చెబుతున్నారు.
2. బయటకు వెళ్లడం, గ్రహణం చూడడం వద్దు
గర్భిణీలు సూర్యగ్రహణాన్ని కళ్లతో చూడడం కానీ, బయటకు వెళ్లడం కానీ చేయరాదు. ఇది శిశువుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అంటారు. కాబట్టి కిటికీలు, తలుపులు మూసి ఇంట్లో ప్రశాంతంగా ఉండడం మంచిది.
3. దూరప్రయాణాలు, ఇతర పనులు మానండి
గ్రహణ సమయంలో దహన సంస్కారాలు జరుగుతున్న ప్రదేశాలు వెళ్లరాదు. అలాగే జుట్టు, గోర్లు కత్తిరించడం, దూరప్రయాణాలు చేయడం కూడా నివారించాలి.
4. తులసి సంబంధిత నియమాలు పాటించండి
గ్రహణ సమయంలో తులసిని పూజించడం, నీరు పోయడం లేదా ఆకులు కోయడం అశుభకరంగా భావిస్తారు. కావున అవసరమైతే తులసి ఆకులను ఒక రోజు ముందుగానే కోసుకుని వాడుకోవాలి.