Black In Color | న‌లుపుగా ఉండే ఈ ఫ్రూట్స్ వ‌ల‌న అన్ని ఉప‌యోగాలు ఉన్నాయా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Black In Color | న‌లుపుగా ఉండే ఈ ఫ్రూట్స్ వ‌ల‌న అన్ని ఉప‌యోగాలు ఉన్నాయా..!

 Authored By sandeep | The Telugu News | Updated on :25 October 2025,9:00 am

Black In Color | ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి పండ్లు, కూరగాయలను మాత్రమే కాకుండా బ్లాక్ ఫుడ్స్‌ను కూడా ఆహారంలో భాగం చేసుకోవడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. నల్ల అత్తిపండ్లు తక్కువ చక్కెరతో ఉండడంతో ప్రొటీన్, ఫైబర్ వంటి పోషకాల సమృద్ధి అందిస్తాయి. వైద్యుల సూచన ప్రకారం, ప్రతిరోజూ రాత్రి రెండు నల్ల అత్తిపండ్లను నానబెట్టి, ఉదయం తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

#image_title

వీటితో ఉప‌యోగాలు ఎన్నో..

అలాగే, నల్ల వెల్లుల్లి గుండె ఆరోగ్యం, యాంటీ బాక్టీరియల్, క్రిమినాశక లక్షణాలతో అనేక వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తుంది. ప్రోటీన్ లోపాన్ని తీరుస్తూ, గుండె, నాడీ వ్యవస్థకు మేలు చేయడానికి మినుములు తినడం చాలా మంచిది. నల్ల ఎండుద్రాక్షల్లో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండడంతో గుండె, ఎముకలు, ఉదరం, జుట్టు, చర్మం, రక్తహీనతకు కూడా ఉపయోగపడుతుంది.

ఇంకా, బ్లాక్ రైస్‌లో పీచు, ప్రొటీన్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటంతో ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ బ్లాక్ ఫుడ్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవడం ఆరోగ్యకరమైన, ఫిట్‌గా ఉండే జీవితానికి సహాయపడుతుంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది