Health Tips | రాత్రి ఆలస్యంగా భోజనం చేస్తే ప్రమాదం .. హార్మోన్ల సమతుల్యత చెడిపోతుంది…
Health Tips | నేటితరం జీవనం వేగంగా సాగుతోంది. ఉద్యోగాలు, షిఫ్ట్‌లు, వ్యక్తిగత బాధ్యతలతో రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయడం మనకూ అలవాటైపోయింది. ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా రాత్రి 8 గంటల తరువాత భోజనం చేయడం వలన హార్మోన్ల అసమతుల్యత, జీర్ణ సమస్యలు, అనేక దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీస్తుందని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి.
#image_title
రాత్రి ఆలస్యంగా తినడం వల్ల కలిగే ప్రమాదాలు
చెన్నైకు చెందిన ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సెంథిల్ గణేషన్ చెప్పిన ప్రకారం, మన శరీరంలో హార్మోన్లు అనేక ముఖ్యమైన చర్యలకు కేంద్రబిందువుగా ఉంటాయి. అయితే రాత్రి తినే అలవాట్లు ఈ హార్మోన్లను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి.
ఆలస్యంగా తినడం వల్ల ఇన్సులిన్ మరియు కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయి.
ఇది మెటబాలిజం వ్యవస్థను దెబ్బతీసి, జీర్ణక్రియను మందగిస్తుంది.
ఒత్తిడి, మానసిక అస్థిరత పెరుగుతుంది.
నిద్రలో అంతరాయం కలిగి, ఆలస్యం, బద్ధకం పెరుగుతాయి.
వెయిట్ గెయిన్, డయాబెటిస్, గుండెజబ్బులు వంటి సమస్యలకు దారి తీస్తుంది.
శరీరానికి విశ్రాంతి ఇవ్వాలంటే, భోజనం చేసిన తర్వాత కనీసం రెండు లేదా మూడు గంటలు గడవాలి. అప్పుడే జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది.
అదే గనుక కుదరకపోతే, ఆహారం జీర్ణం కాకముందే పడుకునే పరిస్థితి వస్తే, అది మీ ఆరోగ్యాన్ని నాశనం చేసే ప్రమాదకరపు ప్రవర్తనగా మారుతుంది.