Bad Habits : ప్రతి మనిషికి కొన్ని మంచి అలవాట్లు ఉంటాయి.. చెడు అలవాట్లు ఉంటాయి. మనిషి అంటేనే తప్పులు చేస్తాడు. ఎవ్వరూ ఇక్కడ వంద శాతం పర్ ఫెక్ట్ ఉండరు. ఏదో ఒక మిస్టేక్ చేస్తూనే ఉంటారు. అయితే.. బతకడం కోసం ఎన్నో తప్పులు చేయడం వేరు. చెడు అలవాట్లతో ఆరోగ్యాన్ని నాశనం చేసుకోవడం వేరు. ఎందుకంటే.. ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే.. ప్రాణాలే పోతాయి. కొన్ని చెడు అలవాట్ల వల్ల.. ఎన్నో ఆరోగ్య సమస్యలను కోరి తెచ్చుకుంటున్నారు కొందరు.
ఆ చెడు అలవాట్లు ఎంత డేంజర్ అంటే.. పొగతాగడం కంటే కూడా డేంజర్ అవి. సిగిరేట్ తాగితే చాలా రోగాలు వస్తాయిని అందరికీ తెలుసు. అయితే.. ఈ అలవాట్ల వల్ల.. సిగిరేట్ తాగడం కంటే కూడా ఎక్కువ ప్రమాదాన్ని కలుగజేస్తాయి. పొగతాగడం వల్ల.. మన దేశంలోనే ఏడాదికి కొన్ని లక్షల మంది చనిపోతున్నారు. మరి.. ఇటువంటి చెడు అలవాట్లకు బానిస అయిన వాళ్లు ఇంకెంత మంది చనిపోతున్నారో ఊహించడం కూడా కష్టం.
తీవ్రంగా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నవారు.. సిగిరేట్ తాగడం కన్నా ఎక్కువ డేంజర్ లో ఉన్నట్టేనట. కొందరు ఎక్కువగా ఒంటరిగా ఉంటారు. వాళ్లకు తోడునీడ ఎవ్వరూ ఉండరు. అటువంటి వాళ్లు చాలా ఒత్తిడికి గురవుతుంటారు. ఒంటరితనం అనేది మనిషికి అస్సలు మంచిది కాదు. ఎవరో ఒకరి తోడు కావాల్సిందే. ఒంటరితనం మనిషిని కుంగదీస్తుంది. తద్వారా అనేక వ్యాధులు వస్తాయి. మెంటల్ టెన్షన్ పెరిగి మనిషి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే.. ఒంటరితనాన్ని జయించాలి. ఏకాంతంగా ఉండటం వేరు.. ఒంటరితనం వేరు.. జీవితంలో ఎవరో ఒకరిని తోడుగా ఉంచుకోవాలి.
కొందరు అయితే రాత్రిళ్లు అస్సలు నిద్రపోరు. ఎందుకంటే వాళ్లకు నిద్రపట్టదు. రాత్రి ఎంత ప్రయత్నించినా వాళ్లకు నిద్రపట్టదు. దీనివల్ల చాలా సమస్యలు వస్తాయి. సమయానికి నిద్రపోవడం అనేది చాలా ముఖ్యం. సిగిరేట్ తాగితే వచ్చే సమస్యల కన్నా.. నిద్రలేమి వల్ల వచ్చే సమస్యలే ఎక్కువట. షుగర్, గుండె సమస్యలు, మానసిక సమస్యలు లాంటివి నిద్రలేమి వల్ల వస్తాయి. అందుకే.. కంటినిండా నిద్రపోవడం అనేది చాలా ముఖ్యం.
కొందరు పోషకాహారాన్ని తినరు. ఏది పడితే అది తింటారు కానీ.. అసలు తినాల్సింది తినరు. పోషకాహార లోపం వల్ల చాలా సమస్యలు వస్తుంటాయి. అలాగే.. ఉంటే చాలా వ్యాధులు వస్తాయి. అందుకే.. పోషకాహార లోపంతో బాధపడేవాళ్లలో పొగతాగేవాళ్లకంటే కూడా ఎక్కువ సమస్యలు ఉంటాయట. అందుకే.. ఎక్కువ పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు.
కూర్చొని పనిచేసే ఉద్యోగాలు చేసేవాళ్లు, కంప్యూటర్ల ముందు గంటలు గంటలు కూర్చొని పనిచేసేవాళ్లు ఖచ్చితంగా ప్రతిరోజూ వ్యాయామం చేయాల్సిందే. గంటల తరబడి కూర్చొని పనిచేసేవాళ్లు.. అస్సలు వ్యాయామం చేయకపోతే.. అది చాలా ఆరోగ్య సమస్యలను తీసుకొస్తుంది. స్మోకింగ్ చేస్తే వచ్చే సమస్యల కన్నా.. ఇలాంటి వాళ్లు ఎక్కువ సమస్యలను కోరి తెచ్చుకుంటారు. కూర్చొని పనిచేసేవాళ్లు ఖచ్చితంగా రోజుకు కనీసం ఒక అరగంట అయినా వ్యాయామం చేయాల్సిందే. లేకపోతే.. శరీరం మొద్దుబారిపోతుంది. రకరకాల సమస్యలు వస్తాయి. బరువు పెరుగుతారు. హార్ట్ ఎటాక్స్ వస్తాయి.
ఇది కూడా చదవండి ==> మామూలోడు కాదు.. అన్నం తినడం ఆపేసి 9 నెలల్లో 60 కిలోలు తగ్గాడు.. ఆయన డైట్ లో ఉన్న ఫుడ్ ఇదే..!
ఇది కూడా చదవండి ==> రోజూ పెరుగు తింటే బరువు పెరుగుతారా? బరువు తగ్గాలంటే ఏం చేయాలి?
ఇది కూడా చదవండి ==> శపించే మొక్కను చూశారా ఎప్పుడైనా? ఈ మొక్క ఆకులను ముట్టుకుంటే ఆత్మహత్య చేసుకోవాల్సిందే?
ఇది కూడా చదవండి ==> ఈ చెట్టు ఎన్ని రోగాలను నయం చేస్తుందో తెలుసా? ఈ చెట్టు ప్రత్యేకత ఏంటంటే?
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
This website uses cookies.