Kadamba Tree : ఈ చెట్టు ఎన్ని రోగాలను నయం చేస్తుందో తెలుసా? ఈ చెట్టు ప్రత్యేకత ఏంటంటే? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Kadamba Tree : ఈ చెట్టు ఎన్ని రోగాలను నయం చేస్తుందో తెలుసా? ఈ చెట్టు ప్రత్యేకత ఏంటంటే?

Kadamba Tree : కదంబ చెట్టు అనే పేరు ఎప్పుడైనా విన్నారా? ఈ చెట్టు మన దగ్గర కూడా పెరుగుతుంది. అయితే… ఇది కేవలం సౌత్ ఏసియా దేశాల్లో మాత్రమే కనిపిస్తుంది. ఇండియాతో పాటు.. శ్రీలంక, పాకిస్థాన్, మాల్దీవులు, భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల్లో పెరిగే ఈ చెట్టు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ చెట్టు ఆరోగ్య గని. ఈ చెట్టు మొత్తం ఆయుర్వదమే. ఎన్నో ఆయుర్వేద […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :27 July 2021,9:40 pm

Kadamba Tree : కదంబ చెట్టు అనే పేరు ఎప్పుడైనా విన్నారా? ఈ చెట్టు మన దగ్గర కూడా పెరుగుతుంది. అయితే… ఇది కేవలం సౌత్ ఏసియా దేశాల్లో మాత్రమే కనిపిస్తుంది. ఇండియాతో పాటు.. శ్రీలంక, పాకిస్థాన్, మాల్దీవులు, భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్, అఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల్లో పెరిగే ఈ చెట్టు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ చెట్టు ఆరోగ్య గని. ఈ చెట్టు మొత్తం ఆయుర్వదమే. ఎన్నో ఆయుర్వేద గుణాలు ఉన్న ఈ చెట్టును ఆయుర్వేద మందుల్లోనూ ఉపయోగిస్తారు.

kadamba tree health benefits telugu

kadamba tree health benefits telugu

కదంబ చెట్టు ఆకులు, వేర్లు, బెరడు.. అన్నింట్లోనూ ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. అందుకే.. ఈ చెట్టుకు ఆయుర్వేదంలో అంత ప్రాముఖ్యత. ఈ చెట్టు మీకు ఎక్కడైనా కనిపిస్తే మాత్రం అస్సలు వదలకండి. ఈ చెట్టును ఖచ్చితంగా వాడాల్సిందే.

Kadamba Tree : డయాబెటిస్ కు చెక్ పెట్టాలంటే.. ఈ చెట్టును ఉపయోగించాల్సిందే

కదంబ చెట్టు వల్ల అసలైన ఉపయోగం ఏంటంటే.. షుగర్ ను కంట్రోల్ లో ఉంచడం. ఈ జనరేషన్ లో ఎక్కువగా అందరికీ వచ్చే షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా కదంబ చెట్టు ఆకు, బెరడు, వేర్లు.. ఏవైనా తీసుకోవచ్చు. ఈ చెట్టు ఆకుల్లో మెథనాలిక్ అనే పదార్థం ఉంటుంది. అది రక్తంలోని షుగర్ లేవల్స్ ను కంట్రోల్ లో ఉంచుతుంది.

kadamba tree health benefits telugu

kadamba tree health benefits telugu

శరీరం మొత్తం నొప్పి ఉన్నా.. మంట ఉన్నా.. వాటి ఆకులను తీసుకొని.. ఆ ఆకులను ఒక క్లాత్ లో పెట్టి.. ఎక్కడైతే నొప్పి పుడుతుందో అక్కడ కట్టులా కట్టాలి. ఈ చెట్టు ఆకుల్లో, బెరడులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు.. ఎన్నో రకాల వ్యాధులను తగ్గిస్తాయి. అలాగే.. దీంట్లో ఉండే క్లోరోజెనిక్ ఆమ్లం.. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీంట్లో ఉండే.. యాంటీ ట్యూమర్ అనే పదార్థం.. శరరీంలో ఏర్పడే ఎన్నో రకాల క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంది. క్యాన్సర్ కణాలు ఉంటే వాటిని నాశనం చేయడంతో పాటు.. అవి పెరగకుండా నిరోధిస్తుంది.

kadamba tree health benefits telugu

kadamba tree health benefits telugu

ఊబకాయంతో బాధపడేవాళ్లు.. కదంబ చెట్టు బెరడును కానీ.. వేర్లను కానీ.. తీసుకోవాలి. శరీరంలోని అనవసర కొవ్వును కరిగించే గుణం దీంట్లో ఉంటుంది. చర్మ వ్యాధులు ఉన్నా కూడా ఈ చెట్టు యొక్క బెరడును తీసుకొని.. దాన్ని పేస్ట్ లా చేసి చర్మంపై రుద్దితే మంచి ఫలితం ఉంటుంది.

ఇది కూడా చ‌ద‌వండి ==> రాత్రి స‌మ‌యంలో కోన్ని చిట్కాల‌ను పాటిస్తే.. అధిక బ‌రువును వేగంగా త‌గించుకోవ‌చ్చు?

ఇది కూడా చ‌ద‌వండి ==> నూనె, ఉప్పు ఎక్కువ వాడేవారు.. పండ్లు, మొలకలు తిన‌లేని వారు.. ఇలా సింపుల్‌గా అదిక బ‌రువు త‌గ్గొచ్చు..!

ఇది కూడా చ‌ద‌వండి ==> షుగర్ పేషెంట్లు ఎక్కువగా కొబ్బరి తింటే… ఎటువంటి ఆరోగ్య సమస్యలు వ‌స్తాయో తెలుసా..?

ఇది కూడా చ‌ద‌వండి ==>  పంచ‌దార‌ను తిన‌డం ఆపేసారా.. అయితే మీకు శ‌రిరంలో ఈ మార్పులు వ‌స్తాయి ?

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది