Curd : రోజూ పెరుగు తింటే బరువు పెరుగుతారా? బరువు తగ్గాలంటే ఏం చేయాలి?
Curd : పెరుగు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఏ కూర ఉన్నా లేకున్నా.. రోజూ అన్నంలో మాత్రం పెరుగు ఉండాల్సిందే. అన్నం చివర్లో కాసింత పెరుగు వేసుకొని చిటికెడు ఉప్పు వేసుకొని తింటే వచ్చే మజానే వేరు. అందుకే.. పెరుగు అంటే చాలు.. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ లొట్టలేసుకుంటూ తింటారు. గడ్డలు గడ్డలుగా ఉండే పెరుగు వేసుకొని.. కాసింత మామిడికాయ చట్నీ అంచుకు పెట్టుకొని తింటే.. అద్భుతంగా ఉంటుంది. పెరుగును తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. నిజానికి పెరుగు అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. పెరుగు లేకుంటే చాలామందికి ముద్దే దిగదు. అంతలా పెరుగును ఇష్టపడతారు కొందరు.
అయితే.. పెరుగును తినడం వల్ల గుండె సమస్యలు తగ్గుతాయి. రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది. అయితే.. పెరుగును ఎక్కువగా తీసుకోవడం వల్ల.. బరువు పెరుగుతారు అనే అపోహ చాలామందిలో ఉంటుంది. అయితే.. అది ఏమాత్రం నిజం కాదు. ఎందుకంటే.. పెరుగు తింటే అస్సలు బరువు పెరగరు. బరువు తగ్గుతారు. పెరుగులో ఉండే పోషకాలు బరువును తగ్గించేందుకు తోడ్పడుతాయి.
Curd : పెరుగులో ఏ పోషకాలు ఉంటాయి?
పెరుగులో ఉండే ప్రొటీన్స్ కు బరువు తగ్గడానికి ఉపయోగపడుతాయి. ఈ ప్రొటీన్.. ఆకలిని తగ్గిస్తుంది. దీనివల్ల బరువు తగ్గే అవకాశం ఉంటుంది. పెరుగులో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం లాంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే.. విటమిన్ బీ2, విటమిన్ బీ12 ఇందులో ఉంటాయి. అలాగే.. పెరుగు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది జీవక్రియ రేటును పెంచుతుంది. అయితే.. ఇందులో ఉండే పోషకాలే బరువు తగ్గడానికి ఉపయోగపడుతాయి కాబట్టి.. నిత్యం ఓ కప్పు పెరుగును తీసుకోవాలి. అయితే.. ఎలాగూ బరువు తగ్గుతున్నాం కదా అని ఎక్కువ పెరుగును మాత్రం తీసుకోకూడదు. రోజూ ఓ కప్పు తీసుకుంటే చాలు.. బరువు తగ్గుతారు. ఎక్కువ తీసుకుంటే మాత్రం బరువు సమస్యలు తప్పవు.
ఇది కూడా చదవండి ==> రాత్రి సమయంలో కోన్ని చిట్కాలను పాటిస్తే.. అధిక బరువును వేగంగా తగించుకోవచ్చు?
ఇది కూడా చదవండి ==> నూనె, ఉప్పు ఎక్కువ వాడేవారు.. పండ్లు, మొలకలు తినలేని వారు.. ఇలా సింపుల్‌గా అదిక బరువు తగ్గొచ్చు..!
ఇది కూడా చదవండి ==> షుగర్ పేషెంట్లు ఎక్కువగా కొబ్బరి తింటే… ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసా..?
ఇది కూడా చదవండి ==> పంచదారను తినడం ఆపేసారా.. అయితే మీకు శరిరంలో ఈ మార్పులు వస్తాయి ?