Suicide Plant : శపించే మొక్కను చూశారా ఎప్పుడైనా? ఈ మొక్క ఆకులను ముట్టుకుంటే ఆత్మహత్య చేసుకోవాల్సిందే?
Suicide Plant : ఈ భూమ్మీద ఉండే చెట్లు అన్నీ మనుషులకు ఉపయోగపడేవే. అవి కార్బన్ డయాక్సైడ్ ను పీల్చుకొని.. ఆక్సీజన్ ను వదులుతాయి. అందుకే.. మనుషులు బతకాలంటే.. చెట్లు కంపల్సరీ ఉండాలి. లేదంటే.. మనిషి మనుగడే కష్టం. అందుకే.. చెట్లను పెంచాలంటూ ప్రభుత్వాలు చెబుతుంటాయి. చెట్లను నరకకూడదని అంటుంటారు. అయితే.. ఒక మొక్క మాత్రం అస్సలు మంచిది కాదు. దాని దగ్గరికి వెళ్తే ఖతమే ఇక. ఆ మొక్కకు ఎంత దూరం ఉంటే అంత మంచిది. కానీ.. తెలియకుండా వెళ్లి ఆ మొక్కను ముట్టుకుంటే మాత్రం ఇక అంతే సంగతులు.
ఆ మొక్క ఆకులను పట్టుకుంటే చాలు.. ఇక జీవితం అయిపోయినట్టే. ఆ ఆకులను ముట్టుకుంటే కలిగే బాధను వర్ణించలేం. ఇంతకీ ఆ మొక్క ఏంటి? ఎందుకు ఆ మొక్క అంత ప్రమాదకారి అనే విషయాలు తెలుసుకుందాం రండి.
Suicide Plant : దీనికి శపించే మొక్క అని పేరు ఎందుకు వచ్చిందంటే?
ఈ మొక్క ఎక్కువగా అడవుల్లో కనిపిస్తుంది. దీని ఆకులు హార్ట్ షేప్ లో ఉంటాయి. పెద్ద పెద్దగా ఉంటాయి ఈ మొక్క ఆకులు. చూడటానికి రావి చెట్టు ఆకుల్లా ఉంటాయి కానీ.. ఇంకాస్త పెద్దవిగా ఉంటాయి. అయితే.. ఈ మొక్క గురించి అసలు విషయం తెలియక.. ఈ మొక్క శపించే మొక్క అని అనుకుంటారు.
ఈ ఆకు దూరం నుంచి చూస్తే బాగానే కనిపిస్తుంది కానీ.. దగ్గరికెళ్లి ఈ ఆకును ముట్టుకుంటే చాలు.. చటక్కున ఆ ఆకు మీద ఉండే.. సన్నని ముళ్లు గుచ్చుకుంటాయి. మామూలుగా తేలు కుట్టినా.. తేనెటీగ కుట్టినా ఎంత నొప్పి వస్తుందో తెలుసు కదా. సేమ్.. ఈ ఆకులను ముట్టుకున్నా కూడా అంతే నొప్పి పుడుతుంది. ఈ ఆకు ముళ్లు గుచ్చుకుంది అంటే ఇక దాన్ని బయటికి తీయడం కష్టం. అవి అతి చిన్నగా ఉంటాయి కాబట్టి.. ఆ ముళ్లులను బయటికి తీయలేం. అయితే.. ఇక.. ఆ ముళ్లు గుచ్చుకున్నాక.. తీవ్రంగా నొప్పి పుట్టడంతో.. ఆత్మహత్య చేసుకోవడం బెటర్ అని అనిపిస్తుంది. అంత నొప్పిని భరించడం చాలా కష్టం. గుచ్చుకున్న ముళ్లును బయటికి తీసేదాకా.. నొప్పి మాత్రం అస్సలు తగ్గదు.
అయితే.. ఈ చెట్లు ఎక్కువగా ఆస్ట్రేలియా అడవుల్లో కనిపిస్తాయి. ఈ ఆకుల ముళ్లులలో విషం ఉంటుంది. అందుకే.. ఆ ఆకు ముళ్లు గుచ్చుకోగానే.. తెగ నొప్పి పుడుతుంది. ఆ విషం కూడా ప్రమాదకరమే. కాకపోతే.. ప్రాణాలు పోయేంత ప్రమాదకరం కాదు. దానికి ఆంటీ డోస్ తీసుకుంటే.. ప్రాణాపాయం తప్పుతుంది కానీ.. నొప్పి మాత్రం తగ్గదు. ఆ ఆకు ముళ్లు గుచ్చుకోగానే.. నొప్పి భరించలేం. తీవ్రంగా నొప్పి వచ్చి.. దాని ముళ్లు గుచ్చుకున్న వ్యక్తి అపస్మారక స్థితికి వెళ్లినా ఆశ్చర్యం లేదు. ముళ్లు గుచ్చుకున్న ప్రాంతంలో ఎర్రగా దుద్దుర్లు కూడా వస్తాయి. అందుకే.. ఈ మొక్క కనిపిస్తే చాలు.. అందరూ దీనికి దూరంగా వెళ్లిపోతారు. దాని దగ్గర ఎవ్వరూ కనిపించరు.
ఇది కూడా చదవండి ==> రాత్రి సమయంలో కోన్ని చిట్కాలను పాటిస్తే.. అధిక బరువును వేగంగా తగించుకోవచ్చు?
ఇది కూడా చదవండి ==> నూనె, ఉప్పు ఎక్కువ వాడేవారు.. పండ్లు, మొలకలు తినలేని వారు.. ఇలా సింపుల్‌గా అదిక బరువు తగ్గొచ్చు..!
ఇది కూడా చదవండి ==> షుగర్ పేషెంట్లు ఎక్కువగా కొబ్బరి తింటే… ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసా..?
ఇది కూడా చదవండి ==> పంచదారను తినడం ఆపేసారా.. అయితే మీకు శరిరంలో ఈ మార్పులు వస్తాయి ?