Google pay : భారత దేశం డిజిటల్ ఇండియాగా మారుతూ ముందుకు వెళ్తోంది. టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత లావాదేవీలు చాలా సులభమయ్యాయి. బ్యాంకులకు వెళ్లి గంటల కొద్దీ క్యూ కట్టి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయాల్సిన అవసరం ఇప్పుడు లేదు. కేవలం మన చేతిలోని స్మార్ట్‌ఫోన్ ద్వారా జస్ట్ నాలుగైదు క్లిక్స్‌తో వేలకు వేలు ట్రాన్స్‌ఫర్ చేయగలుగుతున్నాం. ఇందుకోసం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్-యూపీఐ యాప్స్ ఉపయోగపడ్తున్నాయి. వీటికి చెందిన గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి యాప్స్ ద్వారా డబ్బులను మనం ఒకరి నుంచి మరొకరికి సులువుగా ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాం.
అయితేయూపీఐ వల్ల ఎన్ని లాభాలైతే ఉన్నాయో.. అంతే సంఖ్యలో ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఆన్లైన్ చెల్లింపుల పట్ల జాగ్రత్తగా ఉండకపోతే క్షణాల్లో మీ బ్యాంకు ఖాతాలు ఖాళీ అయ్యే అవకాశాలున్నాయి.సైబర్ నేరగాళ్లు ఆన్‌లైన్ లావాదేవీలపై పడ్డారు. యూపీఐ పేమెంట్స్ చేసే ప్రజలను మోసం చేయడంలో రాటు తేలుతున్నారు. లింక్‌లు, మెసేజ్‌ల ద్వారా మనీ దోచేస్తున్నారు. అంతా అయ్యాక అసలు విషయం తెలుసుకుని అమాయక ప్రజలు షాక్ గురవుతున్నారు. అయితే పేమెంట్ చేసేటప్పుడు ఈ 5 విషయాలను తప్పక పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఏ పేమెంట్ చేయాలన్నా.. ముందు లాక్ తీయాల్సి ఉంటుంది కాబట్టి ప్యాటర్న్ అయినా పిన్ అయినా
స్ట్రాంగ్ గా పెట్టుకోవాలి. పుట్టిన తేది/ మొబైల్ నెంబర్ లలోని నంబర్స్ కాకుండా వేరే నంబరేదో పెట్టుకోవాలి. పిన్ లీక్ అయిందని భావిస్తే.. వెంటనే ఆ నెంబర్‌ను మార్చి మరో కఠిన మైన నంబర్ ను పెట్టుకోవాలి.
ఆన్లైన్ షాపింగ్ విపరీతంగా పెరిగిపోయింది. పదుల కొద్ది యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవడం… వాటి నుంచి షాపింగ్ చేయడం అలవాటుగా మారిపొయింది. ఆయా యాప్ లనుంచే పేమెంట్ లు చేయడం కూడా పెరిగిపోయింది. అయితే ఏ యాప్ పడితే అందులోనుంచి ట్రాన్సాక్షన్ చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
ఎంత దగ్గరి వారైనా.. వారితో మీ యూపీఐ అకౌంట్‌ను లేదా అడ్రస్‌ను పంచుకోవద్దు. మీ యూపీఐ అడ్రస్ మీకు మాత్రమే తెలిసేటట్టుగా ఎప్పటికప్పుడు సురక్షితంగా ఉంచుకోవాలి. మీ ఫోన్ నెంబర్, క్యూఆర్ కోడ్, వర్చ్యువల్ పేమెంట్ అడ్రస్ వంటి వాటిల్లో ముఖ్యంగా ఎంతో జాగ్రత్త అవసరం. కావొచ్చు. ఏదైనా పేమెంట్, బ్యాంకు అప్లికేషన్ ద్వారా మీ యూపీఐ అకౌంట్ ను యాక్సస్ చేయడానికి కూడా మీరు అనుమతించవద్దు.
సైబర్ నేరగాళ్లు ఇటీవల బాగా వాడుతున్న బ్రహ్మాస్త్రం.. ఫేక్ లింక్స్. మనం ఏదైనా ఓ వెబ్ సైట్లో ఏదో కంటెంట్ కోసం ఓపెన్ చేసినప్పుడు.. నచ్చితే ఇక్కడ క్లిక్ చేయండి అంటూ ఎన్నో లింక్స్ వస్తూ ఉంటాయి. వాటిని క్లిక్ చేస్తే అవి కాస్త నేరుగా మన యూపీఐ అకౌంట్ లోకి తీసుకెళ్లి అన్ని స్కాన్ చేసుకుంటుంది. అలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండకపోతే బ్యాంకు ఖాతాలు ఖాళీ అవ్వాల్సిందే
ఏ ట్రాన్సాక్షన్ అయినా యూపీఐ పేమెంట్లతోనే చేస్తున్నారు అంతా. ఇందువల్ల యాప్ స్లో అవుతోంది. అయితే వీటిని అతిగా వాడటం వల్ల ఇందులో బగ్స్ చేరే అవకాశం ఉంది. అప్‌డేటెడ్ వెర్షన్ వచ్చినప్పుడు, మీరు మీ యాప్‌ను అప్‌డేట్ చేసుకుంటే బెటర్ అని చెప్పవచ్చు..
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
This website uses cookies.