Google pay : ఫోన్‌పే, గూగుల్ పే గురించి ఇది విన్నారా.. డబ్బులన్నీ మాయం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Google pay : ఫోన్‌పే, గూగుల్ పే గురించి ఇది విన్నారా.. డబ్బులన్నీ మాయం..!

 Authored By kranthi | The Telugu News | Updated on :21 December 2021,11:00 am

Google pay : భారత దేశం డిజిటల్ ఇండియాగా మారుతూ ముందుకు వెళ్తోంది. టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత లావాదేవీలు చాలా సులభమయ్యాయి. బ్యాంకులకు వెళ్లి గంటల కొద్దీ క్యూ కట్టి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయాల్సిన అవసరం ఇప్పుడు లేదు. కేవలం మన చేతిలోని స్మార్ట్‌ఫోన్‌ ద్వారా జస్ట్ నాలుగైదు క్లిక్స్‌తో వేలకు వేలు ట్రాన్స్‌ఫర్ చేయగలుగుతున్నాం. ఇందుకోసం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్-యూపీఐ యాప్స్ ఉపయోగపడ్తున్నాయి. వీటికి చెందిన గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి యాప్స్ ద్వారా డబ్బులను మనం ఒకరి నుంచి మరొకరికి సులువుగా ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాం.

అయితేయూపీఐ వల్ల ఎన్ని లాభాలైతే ఉన్నాయో.. అంతే సంఖ్యలో ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఆన్లైన్ చెల్లింపుల పట్ల జాగ్రత్తగా ఉండకపోతే క్షణాల్లో మీ బ్యాంకు ఖాతాలు ఖాళీ అయ్యే అవకాశాలున్నాయి.సైబర్ నేరగాళ్లు ఆన్‌లైన్ లావాదేవీలపై పడ్డారు. యూపీఐ పేమెంట్స్ చేసే ప్రజలను మోసం చేయడంలో రాటు తేలుతున్నారు. లింక్‌లు, మెసేజ్‌ల ద్వారా మనీ దోచేస్తున్నారు. అంతా అయ్యాక అసలు విషయం తెలుసుకుని అమాయక ప్రజలు షాక్ గురవుతున్నారు. అయితే పేమెంట్ చేసేటప్పుడు ఈ 5 విషయాలను తప్పక పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

things to follow while we using phone pay and Google pay

things to follow while we using phone pay and Google pay

1. స్క్రీన్ లాక్ కఠినంగా ఉండాలి:

ఏ పేమెంట్ చేయాలన్నా.. ముందు లాక్ తీయాల్సి ఉంటుంది కాబట్టి ప్యాటర్న్ అయినా పిన్ అయినా
స్ట్రాంగ్ గా పెట్టుకోవాలి. పుట్టిన తేది/ మొబైల్ నెంబర్ లలోని నంబర్స్ కాకుండా వేరే నంబరేదో పెట్టుకోవాలి. పిన్ లీక్ అయిందని భావిస్తే.. వెంటనే ఆ నెంబర్‌ను మార్చి మరో కఠిన మైన నంబర్ ను పెట్టుకోవాలి.

2. అన్ని యాప్స్ వద్దే వద్దు..!

ఆన్లైన్ షాపింగ్ విపరీతంగా పెరిగిపోయింది. పదుల కొద్ది యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవడం… వాటి నుంచి షాపింగ్ చేయడం అలవాటుగా మారిపొయింది. ఆయా యాప్ లనుంచే పేమెంట్ లు చేయడం కూడా పెరిగిపోయింది. అయితే ఏ యాప్ పడితే అందులోనుంచి ట్రాన్సాక్షన్ చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

3. డోంట్ షేర్ యూపీఐ అడ్రస్‌:

ఎంత దగ్గరి వారైనా.. వారితో మీ యూపీఐ అకౌంట్‌ను లేదా అడ్రస్‌ను పంచుకోవద్దు. మీ యూపీఐ అడ్రస్ మీకు మాత్రమే తెలిసేటట్టుగా ఎప్పటికప్పుడు సురక్షితంగా ఉంచుకోవాలి. మీ ఫోన్ నెంబర్, క్యూఆర్ కోడ్, వర్చ్యువల్ పేమెంట్ అడ్రస్ వంటి వాటిల్లో ముఖ్యంగా ఎంతో జాగ్రత్త అవసరం. కావొచ్చు. ఏదైనా పేమెంట్, బ్యాంకు అప్లికేషన్ ద్వారా మీ యూపీఐ అకౌంట్ ను యాక్సస్ చేయడానికి కూడా మీరు అనుమతించవద్దు.

4. ఫేక్ లింక్ పై క్లిక్ చేయవద్దు..!

సైబర్ నేరగాళ్లు ఇటీవల బాగా వాడుతున్న బ్రహ్మాస్త్రం.. ఫేక్ లింక్స్. మనం ఏదైనా ఓ వెబ్ సైట్లో ఏదో కంటెంట్ కోసం ఓపెన్ చేసినప్పుడు.. నచ్చితే ఇక్కడ క్లిక్ చేయండి అంటూ ఎన్నో లింక్స్ వస్తూ ఉంటాయి. వాటిని క్లిక్ చేస్తే అవి కాస్త నేరుగా మన యూపీఐ అకౌంట్ లోకి తీసుకెళ్లి అన్ని స్కాన్ చేసుకుంటుంది. అలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండకపోతే బ్యాంకు ఖాతాలు ఖాళీ అవ్వాల్సిందే

5. అప్డేట్ యువర్ ఆప్..!

ఏ ట్రాన్సాక్షన్ అయినా యూపీఐ పేమెంట్లతోనే చేస్తున్నారు అంతా. ఇందువల్ల యాప్ స్లో అవుతోంది. అయితే వీటిని అతిగా వాడటం వల్ల ఇందులో బగ్స్ చేరే అవకాశం ఉంది. అప్‌డేటెడ్ వెర్షన్ వచ్చినప్పుడు, మీరు మీ యాప్‌ను అప్‌డేట్ చేసుకుంటే బెటర్ అని చెప్పవచ్చు..

Advertisement
WhatsApp Group Join Now

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది