Love Couple : ప్రేమజంటను నాగలికి కట్టి పొలం దున్నిన గ్రామస్థులు.. ఏంటి ఈ దారుణాలు..!
Love Couple : ఒడిశా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లాలో మానవత్వాన్ని తలదించుకునేలా చేసే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నారాయణపట్టణం సమితికి చెందిన బైరాగి పంచాయతీలో గ్రామ పెద్దలు ప్రేమజంటను నాగలికి ఎద్దుల్లా కట్టి, కర్రలతో కొడుతూ పొలం దున్నించారు. ఈ అఘాయిత్యంపై స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
Love Couple : ఇంత అరాచకమా..!
పెద్దఇటికీ గ్రామానికి చెందిన యువకుడు, యువతి ఒకే కుటుంబానికి చెందినవారు. వరుసకు అన్నాచెల్లెలే అయినా, ఇద్దరూ ఒకరికొకరు ప్రేమగా మమేకమయ్యారు. తమ ప్రేమను కుటుంబ సభ్యులకు తెలియజెప్పినా ఒప్పుకోలేదు. దాంతో, ఐదేళ్ల క్రితం ఊరిని విడిచి వెళ్లిపోయారు. ఇటీవల గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఈ జంటను మళ్లీ గ్రామానికి రప్పించారు.
Love Couple : ప్రేమజంటను నాగలికి కట్టి పొలం దున్నిన గ్రామస్థులు.. ఏంటి ఈ దారుణాలు..!
“గ్రామస్థుల సమక్షంలో వివాహం జరిపిస్తాం” అనే హామీ ఇచ్చి నమ్మించారు. అయితే, గ్రామ పెద్దలు ఈ పెళ్లికి మద్దతు ఇవ్వకపోవడంతో పరిస్థితి మారిపోయింది. జంటను నాగలికి కట్టి, ఎద్దుల్లా వ్యవహరిస్తూ పొలం దున్నించారు. అంతేకాదు, కర్రలతో హింసించారు కూడా. ఈ దృశ్యాలు గ్రామస్థుల సమక్షంలోనే జరిగాయి.ఈ ఘటనపై ఇప్పటివరకు పోలీసులు స్పందించలేదు. అయితే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హక్కుల సంఘాలు, మానవ హక్కుల కార్యకర్తలు తీవ్రంగా స్పందిస్తున్నారు.