Viral video : బైక్ పై ప్రేమజంట విన్యాసాలు… ఒళ్ళు మరిచి నడిరోడ్డు పై హత్తుకుని.. వైర‌ల్ వీడియో ! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Viral video : బైక్ పై ప్రేమజంట విన్యాసాలు… ఒళ్ళు మరిచి నడిరోడ్డు పై హత్తుకుని.. వైర‌ల్ వీడియో !

Viral video : ప్రేమ మత్తులో మునిగిన వారికి గాల్లో తేలినట్లుగా ఉంటుందని అందరూ అంటుంటే వింటుంటాం. అదేవిధంగా కొన్ని సందర్భాలలో స్వయంగా చూస్తూ ఉంటాం కూడా. ఇక ఆ ప్రేమ మత్తులో ఉన్నవారిని అంచనా వేయడం చాలా కష్టం అని చెప్పాలి. ఎందుకంటే వారు ఎప్పుడూ ఎలా ఉంటారో వారికే తెలియదు. మరికొందరు ప్రేమికులు అయితే ఒళ్ళు తెలియకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక ప్రస్తుత కాలంలో చాలామంది చుట్టూ జనం ఉన్నారని ఇంగిత జ్ఞానం కూడా […]

 Authored By aruna | The Telugu News | Updated on :15 January 2024,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Viral video : బైక్ పై ప్రేమజంట విన్యాసాలు... ఒళ్ళు మరిచి నడిరోడ్డు పై హత్తుకుని.. వైర‌ల్ వీడియో !

Viral video : ప్రేమ మత్తులో మునిగిన వారికి గాల్లో తేలినట్లుగా ఉంటుందని అందరూ అంటుంటే వింటుంటాం. అదేవిధంగా కొన్ని సందర్భాలలో స్వయంగా చూస్తూ ఉంటాం కూడా. ఇక ఆ ప్రేమ మత్తులో ఉన్నవారిని అంచనా వేయడం చాలా కష్టం అని చెప్పాలి. ఎందుకంటే వారు ఎప్పుడూ ఎలా ఉంటారో వారికే తెలియదు. మరికొందరు ప్రేమికులు అయితే ఒళ్ళు తెలియకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక ప్రస్తుత కాలంలో చాలామంది చుట్టూ జనం ఉన్నారని ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఒళ్ళు తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. ఇక వాటికి సంబంధించిన వీడియోలను మనం సోషల్ మీడియాలో చాలానే చూసాం. అలాంటి వారిని ఎన్ని విధాలుగా ఆపాలని చూసిన వారు మాత్రం ఆగే పరిస్థితి కనిపించడం లేదు. మరీ ముఖ్యంగా ఢిల్లీ మెట్రోలో ఇలాంటి ఘటనలు చాలా చోటు చేసుకున్నాయి. అదేవిధంగా నడిరోడ్డుపై నిబంధనలను ఉల్లంఘించి ప్రేమికులు వారి బైక్ పై తమదైన లోకంలో తేలిపోతూ ప్రయాణిస్తున్న ఘటనలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇక ఇలాంటి వీడియోలు కూడా మనం సోషల్ మీడియాలో చాలా చూశాం.

అయితే తాజాగా ముంబై బాంద్రా రికమెషన్ రోడ్ లో ఇలాంటిదే మరొక ఘటన చోటుచేసుకుంది. దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియోలో యువకుడు స్కూటర్ నడుపుతూ ఉంటే అతని ప్రియురాలు వెనుక కూర్చోకుండా ప్రియుడి ఎదురుగా కూర్చుని ఉంది. అంతేకాక చలికాలం కావడంతో ఇద్దరు ఒకే దుప్పటి కప్పుకుని ప్రయాణం చేస్తున్నారు. ఇక ప్రియుడు డ్రైవింగ్ చేస్తుండగా ప్రియురాలు ముందు నుంచి కూర్చొని దుప్పటి కప్పి ప్రియుడిని హత్తుకుని కూర్చుంది. ఇక వారు ప్రయాణించే రోడ్డును గమనించినట్లయితే అది ఒక హైవేగా కనిపిస్తోంది. అలాంటి ప్రమాదకరమైన రోడ్లపై వారు ఇలా సన్నిహితంగా ఉంటూ స్కూటర్ పై వెళ్తుండగా మరో వాహనా దారుడు వారిని వీడియో తీశాడు.

ఇక ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. అయితే నడిరోడ్డుపై ఆ జంట అసభ్యకరమైన రీతిలో కనబడడం అందరినీ విష్మయానికి గురిచేసిందని చెప్పాలి. నడిరోడ్డుపై బైక్ పైన యువకుడిని కౌగిలించుకొని కూర్చోవడమే కాక అతని ఒడిలో కూర్చుని అమ్మాయి ప్రదర్శించిన తీరు విధానం నేటి జనులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తుంది. దీంతో నేటిజనులు ఇలాంటి జంటలను వెంటనే అరెస్ట్ చేయాల్సిందిగా ముంబై పోలీసులను కోరుతున్నారు. రోడ్లపై ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండే విధంగా కఠినమైన చర్యలు నిబంధనలు తీసుకురావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు వైరల్ అవ్వడం ఇది మొదటిసారి అయితే కాదు. గతంలో కూడా ఓ జంట ఇలాగే చేస్తే ట్రాఫిక్ పోలీసులు వారికి భారీ స్థాయిలో ఫైన్ విధించడం జరిగింది. అయినప్పటికీ ప్రేమ జంటలు మాత్రం ఇలాంటి సాహసాలు చేసేందుకు ఉపక్రమిస్తూనే ఉన్నారు. ఇక ఇలాంటి సంఘటనలు అసలు జరగకుండా ఉండాలంటే కఠినమైన చర్యలు తీసుకోక తప్పదు.

aruna

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక