Chandrababu – Jagan : చంద్రబాబు జీవితానికీ, జగన్ జీవితానికీ మధ్య అతి పెద్ద తేడా ఇదే..!
Chandrababu – Jagan : అందరికీ నాణ్యమైన విద్యను వైసీపీ ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని.. దానికి సామాజిక, ఆర్థిక సంబంధం అనేది కూడా ఉండదని పెనమలూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. అయితే.. సీఎం జగన్ ను ఆయన పొగడ్తల్లో ముంచెత్తారు. అంతే కాదు.. విద్యపై ఏకంగా రూ.30 వేల కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోందని అలాంటి ప్రభుత్వం దేశంలో ఇంకేదైనా ఉందా అని ఆయన స్పష్టం చేశారు. విద్యపై పెట్టుబడి అనేది విప్లవాత్మక మార్పు అని ఆయన పేర్కొన్నారు.
ఒకప్పుడు చంద్రబాబు నాయుడు.. విద్య ప్రభుత్వ బాధ్యత కాదని తప్పించుకున్నారు కానీ.. సీఎం జగన్ మాత్రం అలా చేయలేదు.. విద్యను పేద గడపలకు చేర్చారు అంటూ ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు, జగన్ నిర్దేశించుకున్న లక్ష్యాల్లో ఎంతో తేడా ఉంది. దీన్ని ప్రజలు గమనించాలి. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది జగన్ ప్రభుత్వమే అని జగన్ నాయకత్వంలో తమ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకొచ్చిందన్నారు.
Chandrababu – Jagan : చంద్రబాబు, జగన్ నిర్దేశించుకున్న లక్ష్యాల్లో ఎంతో తేడా ఉంది
మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను కూడా దాదాపు 99.5 శాతం వైసీపీ ప్రభుత్వం నెరవేర్చింది. దాన్ని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేదు. అన్ని వర్గాల ప్రజలకు లబ్ది చేకూరుతుంటే.. ప్రతిపక్షాలు మాత్రం అల్లర్లు సృష్టిస్తున్నాయి. వర్గ విభేదాలు సృష్టిస్తున్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు కూడా ఫీజును పూర్తిగా రీయంబర్స్ చేస్తున్న ప్రభుత్వం ఏపీది మాత్రమే.. గత ప్రభుత్వాలు ఏనాడైనా ఇంత భారీగా విద్య కోసం కేటాయింపులు చేశాయా? అంటూ పార్థసారథి స్పష్టం చేశారు.