Tiktok Durga Rao : వీడెవడ్రా బాబు.. అని అనుకున్నా.. సుడిగాలి సుధీర్ పై టిక్ టాక్ దుర్గారావు షాకింగ్ కామెంట్స్?
Tiktok Durga Rao : టిక్ టాక్ దుర్గారావు తెలుసు కదా. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. సోషల్ మీడియాలో మనోడికి ఉన్న క్రేజ్ ఇంకెవ్వరికీ లేదు. వ్యవసాయం చేసుకుంటూ సాదాసీదాగా తన జీవితాన్ని సాగించే దుర్గారావు.. తెలుగు రాష్ట్రాల్లోనే హాట్ టాపిక్ అవుతాడని ఎన్నడూ ఊహించి ఉండడు. టిక్ టాక్ లో టైమ్ పాస్ కోసం వీడియోలు చేస్తూ నేడు సోషల్ మీడియా స్టార్ గా ఎదగడమే కాదు.. సినిమాల్లోనూ నటిస్తూ సెలబ్రటీ అయిపోయాడు దుర్గారావు.

tiktok durga rao comments on sudigali sudheer
టీవీ చానెళ్లు అయితే దుర్గారావు కోసం క్యూ కడుతున్నాయి. తమ షోలలో గెస్ట్ గా రావాలంటూ పట్టుబడుతున్నాయి. అది దుర్గారావుకు ఉన్న క్రేజ్. దుర్గారావుతో పాటు ఆయన భార్య కూడా సెలబ్రిటీ అయిపోయారు. టిక్ టాక్ బ్యాన్ అయినా కూడా వీళ్ల క్రేజ్ మాత్రం తగ్గలేదు. అంతకంతకూ పెరుగుతూ పోయింది. అయితే.. టిక్ టాక్ దుర్గారావు తాజాగా సుడిగాలి సుధీర్ పై షాకింగ్ కామెంట్లు చేశాడు.

tiktok durga rao comments on sudigali sudheer
Tiktok Durga Rao : జబర్దస్త్ షూటింగ్ సమయంలో సుధీర్ తో పరిచయం
దుర్గారావు జబర్దస్త్ లోనూ గెస్ట్ రోల్ లో వచ్చి నటించాడు. హైపర్ ఆది టీమ్ లో దుర్గారావు ఓ క్యారెక్టర్ చేశాడు. ఆ సమయంలోనే జబర్దస్త్ సెట్ లో సుడిగాలి సుధీర్ తో పరిచయం ఏర్పడిందట. అయితే.. సుధీర్ ఎక్స్ ట్రా జబర్దస్త్ లో చేస్తుండటం వల్ల.. జబర్దస్త్ షూటింగ్ అయిపోయాక.. తన రూమ్ కు వెళ్తున్న సమయంలో సుధీర్.. దుర్గారావుకు కనిపించాడట. సుధీర్ మాస్క్ వేసుకొని ఉండటం వల్ల.. ఆయన ఎవరో గుర్తు పడ్డలేకపోయాడట దుర్గారావు. సుధీర్.. దుర్గారావును చూసి.. బాగున్నారా? అని అడిగాడట.

tiktok durga rao comments on sudigali sudheer
అయితే.. ఎవరో అనుకొని హా.. బాగున్నా అని అన్నాడట దుర్గారావు. ఆ తర్వాత సుధీర్ మాస్క్ తీసేసరికి.. సార్.. మీరా సార్.. గుర్తు పట్టలేదు అని అన్నాడట. అయ్యో.. నన్ను సార్ అనకు.. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీ వీడియోలు అన్నీ చూస్తాను. బాగా చేస్తావు అంటూ దుర్గారావును సుధీర్ మెచ్చుకున్నాడట. చాలా రోజుల కింద జరిగిన ఈ ఘటనను తాజాగా ఓ ఇంటర్వ్యూలో టిక్ టాక్ దుర్గారావు చెప్పుకొచ్చారు.